1. ఆస్వాదనా అరుదైనదే_మౌనం స్వర పరచిన శబ్దానికి...!!
2. ఆత్మీయ స్నేహ సరాగమది_ఆనంద రాగం మనదైనదని...!!
3. అక్షరాలు అక్షయాలే_మనసాకాశాన్ని అద్దంలో చూపిస్తూ...!!
4. నిరాశ నీరవమైంది_స్తబ్ధతను ఛేదించిన ప్రేమ పలుకులకు... !!
5. సరిగమలూ సమాయత్తమౌతున్నాయి_మౌనస్వరాలకు బాణీలు కట్టాలని...!!
6. గాత్రమూ మధురమే_గుప్పెడుగుండె సవ్వడుల స్వరాల జతలో...!!
7. భావాలకూ సంబరమే_మనసాక్షరాలు మనవని తెలిసి...!!
8. ఇరు ఆత్మల సంధానమది_మమేకమైన మనసుల అంత:కరణ సాక్షిగా...!!
9. గాయమే గేయమైంది_మనసు రాసిన కవనంతో కలిసి....!!
10. అక్షరాలొదిగి పోయాయి_భావాల సారూప్యతకు దాసోహమై...!!
11. సాయంత్రాలను స్వాగతిస్తున్నా_రాతిరి కలలతో కలిసిన రేపటి కోసం...!!
12. రెండు ఆత్మలొకటిగా చేరిన క్షణాలు_బింబ ప్రతిబింబాలకు తావులేకుండా...!!
13. రాహుకేతువుల కోపం కాసేపే_జీవితానికి గ్రహణం వీడేదెన్నడో...!!
14. మరణాన్నీ ఆస్వాదించాలనుకున్నా_జీవితపు మరో పార్శ్వాన్ని చూడాలని...!!
15. మది మౌనం వీడింది_చెలిమి నిజాయితీని గుర్తెరిగి...!!
16. పరిమళం నీ నెయ్యానిదే_కయ్యానికి చోటివ్వని సాంగత్యం మనదైనప్పుడు...!!
17. మరు మల్లియవే నీవు_నిత్యం చెలిమి పరిమళాలు వెదజల్లుతూ...!!
18. అక్షరాలు ఆడుకుంటున్నాయి_భావాలు మాలిమి అయ్యాయని...!!
19. కలత పడ్డ మనసు_కలవరాన్ని మరచింది నీ సాన్నిహిత్యంలో...!!
20. మనసేనాడో మౌనమైంది_నీలో నేను లేనని తెలిసి....!!
21. నా మనసు నీతోనే ఉందిగా_మౌనాన్ని కూడ మాటల్లో ముంచేస్తూ..!!
22. మౌనాన్ని శలవడిగింది మనసు_మన మధ్యనున్న బంధానికి దాసోహమై...!!
23. మనసుకు మనసైంది_నీ మాటల మధువు గ్రోలి....!!
24. విరిసిన నవ్వులతో జత చేరాయి_చెక్కిలిపై ఆనందభాష్పాలుగా మారి...!!
25. అక్షరాలన్నీ సమ్మెాహన సమ్మిళితాలే_మన భావాల సంఘర్షణకు చిక్కి...!!
26. కోపమే శాపమౌతుంది_మనసు మధన పడుతూ రుథిరాన్ని చిమ్ముతుంటే...!!
27. తలపులను తడియారనీయడం లేదు_జ్ఞాపకమై వెన్నాడుతూ...!!
28. అభిమానం గెలిచిందట_బురద నుండి కమలం బయట పడినప్పుడు...!!
29. రేరాజు స్వాగతించాడట_వెన్నెల్లో వన్నెల కలువను...!!
30. పండు వెన్నెల పండగ చేసుకుందట_కలువల మధ్యన పూర్ణ చంద్రుని చూసి...!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి