4, జూన్ 2018, సోమవారం

భరత వాక్యానికి..!!

రాతిరి నిద్దరోతుంటే
రెప్ప పడని కనులెన్నో

వేకువ వెలుతురొద్దనే
వేసారిన బతుకులెన్నో

కాలపు కనికట్టు మాయలో 
నడమంత్రపు నయగారాలెన్నో 

పలుకు నేర్వని పసితనంలో
వినిపించే బృందగానాలెన్నో

గాయాల బతుకుల్లో
గాంధర్వరాగాలు వినిపించేదెన్నడో

స్మశాన వైరాగ్యంలో
సప్తపదుల హోరు వినవస్తోందెందుకో

బద్దలైన నిశ్శబ్దంలో
భరత వాక్యానికి నాంది పలకడానికనుకుంటా...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner