11, జూన్ 2018, సోమవారం

ఏక్ తారలు...!!

1.  పంచాంగం పరిహసిస్తోంది_పరామర్శకు మీనమేషాలు లెక్కిస్తున్నావని...!!

2.  అమాస అల్లరి చేస్తోంది_పాడ్యమి పలకరింపుకు వస్తోందని...!!

3.   కలతలను మాపేయాలి_కలల ఉలికిపాటుకు ఊరటగా...!!

4.   కనుమరుగు కాలేని కాంతిపుంజాన్నే_చుక్కలెన్నయినా నీ చేరువలోనేనంటూ...!!

5.   నేనో మౌనాన్ని_నీ మనసు చదివే క్షణాల్లో...!!

6.  నేనో నాదాన్ని_నీ స్వరంలో ఒదిగిపోతూ...!!

7.  నేనో ఉద్వేగాన్ని_నీ అనుభూతులకు ప్రాణం పోస్తూ...!!

8.   నీ మనసు_ఎన్నో మౌనాలను దాచుకున్న సంద్రం..
!!

9.   నేనో అలజడిని_అవిశ్రాంతంగా నిన్ను తట్టిలేపుతూ..!!

10.   నేనో మెలకువను_నీ కలలకు అర్ధాన్నౌతూ...!!

11.   మాయ తెలియదు మనసుకు_కలను కల్లగా మార్చడానికి...!!

12.   కందమూలాలకు కటకటలౌతోంది_శాకాహారం విలువ తెలిసాక...!!

13.   రెప్పలు దాచేసిన కన్నీళ్ళు_అలవోకగా అక్షరాల్లో ఒలికిపోతూ....!!

14.  బొమ్మలన్నీ జీవం లేనివే_జీవం పోసే విధాత చేతిలో కీలుబొమ్మలై...!!

15.  కొన్ని క్షణాలు చాలు_యుగాల దూరాన్ని తగ్గించడానికి...!!

16.  కాస్త మౌనం చాలదూ_వేల భాష్యాలు వినిపించడానికి..!!

17.  మౌనానికెన్ని అరలో_మనసులోని భావాలను భద్రపరిచేందుకు..!!

18.  జ్ఞాపకాల సహవాసం మౌనానికి_కాలం నేర్పిన పాఠాలను నెమరువేసుకుంటూ..!!

19.   గుండెగూటిలో తచ్చాడుతునే ఉన్నాయి_సశేషంగా మిగిలిన సజీవ జ్ఞాపకాలు...!!

20.   నేనెప్పుడో ముగిసిన కథనే_చెదిరిన జ్ఞాపకంగా చిరిగిన పుస్తకం పేజిలో...!!

21.  ఏకాంతమింతే_నీతోనే సంభాషించాలనుకుంటుందెప్పుడూ...!!

22.   మౌనమే మధురం మన మధ్యన_మనసుల స్నేహం మనదయ్యాక...!!

23.  వెల్లువైన ప్రేమ వగలుబోతోంది_వలపు విరిజల్లులో తడిసి ముద్దౌతూ...!!

24.  కొన్ని ప్రేమలంతే_మనసుకే పరిమితమైపోతాయలా...!! 

25.   మౌనమెప్పుడూ సమ్మెాహనమే_సన్నిహితమైన నీ ఆలోచనల సవ్వడితో..!!

26.   రాగమూ యెాగమైంది_మనసుకన్నీరు సంగీతఝురిగా మారినప్పుడు...!!

27.  రాలిపడిన కలలివి_రక్కసి కోరలకు చిక్కుబడి...!!

28.  దాచిన క్షణాలు గుప్పెడే_సాహచర్యం కడవరకు..!!

29.  ఎన్ని దారులో ప్రణయానికి_పరిచయం లేకున్నా పరిమళిస్తూ...!!

30.   అరక్షణం చాలదూ_అనుబంధం అపహాస్యం కావడానికి....!!

1 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Unknown చెప్పారు...

dear sir very good blog and very good content
Telangana News

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner