10, జూన్ 2018, ఆదివారం

పుట్టినరోజు శుభాకాంక్షలు..!!

బాబాయ్ అబ్బాయ్ గా హాస్యం పండించినా, చక్కని నటనా ప్రతిభను జననీ జన్మభూమిలో చూపించినా, ఉహాజనిత భవిష్య ఆదిత్య 369, శ్రీరామ రాజ్యం వంటి పౌరాణికం, సింహ వంటి రౌద్ర రసం ఇలా ఏ రసాన్నైనా చేసి మెప్పించగల  మంగమ్మగారి మనుమడు, విమర్శకులకు, మిగతా నటుల అభిమానులకు కనిపించే లోపం కోపం ఒక ఆభరణమైన బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

నేను సినిమావాళ్ళ గురించి పోస్టులు పెద్దగా పెట్టలేదు. కానీ ఈరోజు చాలామంది పోస్టులు చూసాను. అవి చూసాక ఇది రాయాలనిపించింది. అభిమానం అనేది ఎంతగా వెర్రితలలు వేసిందనేది అర్ధం అయ్యింది. మనమెప్పుడు మాట తూలలేదా, మన మీద ఎవరైనా పడినప్పుడు శాంతంగానే ఉన్నామా. పోనీ మనం అభిమానించే నటులు కానివ్వండి, నాయకులు కానివ్వండి ఏ తప్పు చేయ లేదా. బాలయ్యకు కోపం మాత్రమే ఉంది, ఎవరి చావుకు కారణం కాలేదు, పార్టీలెట్టి సొమ్ము నొక్కేసి నమ్మిన జనాన్ని నట్టేట ముంచి పదవి కోసం దిగజారలేదు. కుటుంబానికి, వివాహబంధానికి మచ్చ తేలేదు.

అమ్మ నేర్పిన సంస్కారం మనది... అందుకే మన అభిమానాన్ని మరొకరిపై ద్వేషంగా మార్చుకోవద్దు. తప్పుని తప్పుగానే చూద్దాం. 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner