చాలా రోజులుగా చెప్పాలనుకుంటున్న కొన్ని విషయాలు ఇప్పుడు చెప్తాను. నేను ఎప్పుడు నాకు రాయాలనిపించింది మాత్రమే రాస్తాను. చాలామంది చాలాసార్లు అడుగుతారు, ఫలానా దాని మీద రాసివ్వండి అని. నాకు కుదిరినప్పుడు, రాయాలనిపించినప్పుడు రాసిస్తానని చెప్తాను. నా రాతలు నాకు రాయాలని అనిపించినప్పుడే రాయడం చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు. నేను కవినని కాని, రచయితనని కాని ఎప్పుడు ఎక్కడా చెప్పలేదు. నాకనిపించిన భావాలకు ఓ అక్షర రూపాన్ని నాకు తోచిన రీతిలో ఇవ్వడం మాత్రమే తెలుసు.
నే రాసిన అక్షరాలకు స్పందనలో అనురాధ వేదాంతం గారు ఓ సీన్ చెప్పి కవిత రాయమని అడిగారు. నాకు రాయాలనిపించినప్పుడు రాసి పంపిస్తానని చెప్పాను. దానికి ఆవిడ స్పందనలు నా గోడ మీద అందరు చూడవచ్చు. నా గోడ మీద నాకనిపించినవి రాసుకునే హక్కు నాకుంది కదా. నేనెవరికీ సలహాలు, సూచనలు ఎప్పుడు చెప్పను, ముక్కు మొహం తెలియని వారు, వయసులో పెద్దవారు కొందరు ఎందుకిలా ప్రవర్తిస్తారో మరి. నేను రాయడంతో ఆవిడకున్న ఇబ్బంది ఏమిటో నాకర్ధం కాలేదు. ఆవిడ అడిగినది నేను నాకనిపించినప్పుడు రాసిస్తాను అన్నా, ఆవిడ నేనిక నా గోడ మీద ఏమి రాయకూడదనడానికి కారణం ఏమిటో.? ఆవిడ బాధ ఏంటో నాకర్ధం కాలేదు. ఆవిడనే కాదు నా లిస్ట్ లో ఉన్న అందరికి ఇదే చెప్తున్నా మీకు ఇష్టమైతే చదవండి లేదా ఊరుకోండి. కాదు కూడదంటారా నా లిస్ట్ లో నుండి నిరభ్యతరంగా వెళ్లిపోండి. అస్సలు ఇబ్బంది పడవద్దు. సద్విమర్శలు చేయండి స్వాగతిస్తాను, కానీ మీ అక్కసు వెళ్లబోసుకోవడానికి, ఊరికే ఉచిత సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించకండి. మరోసారి చెప్తున్నా నేను కవిని కాని, రచయితను కాని కాదు. నాకనిపించిన భావాలకు నాకు తోచినట్లు అక్షరరూపమిస్తూ ఆనందిస్తున్నా. మీరేంటి అన్నది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా.... నమస్కారం...!!
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
మీ గోడ ఎక్కడుందండీ ?
జిలేబి
https://www.facebook.com/vinjamuri.venkataapparao
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి