1. అంతరంగం అణు విస్ఫోటనమయ్యింది_మదిని తాకిన మాటల తూటాలకు....!!
2. భావతరంగాల అంతర్మథనం_అనంతాకాశానికి చేరువగా...!!
3. అక్షరాల్లో అలవోకగా ఒదిగిపోతాయి_మనసు దాయలేని భావాలన్నీ...!!
4. ఫలించకున్నా గెలిచిన ప్రేమది_త్యాగానికి మరో రూపమై...!!
5. పరిచితమే ఎప్పుడూ_అపరిమితమైన నీ జ్ఞాపకాలతో...!!
6. ఎద నిండిన జ్ఞాపకమైతే చాలు_ఏళ్ళ తరబడి నిలిచిపోవడానికి....!!
7. ఒడిజేరని ఓదార్పది_కలానికందని మనసును కాలంలో కలిపేస్తూ...!!
8. మానస సంచారమే ఇది_వెలితైన అనుబంధాలను వెలికి తీయడానికి...!!
9. అమ్మ భాష తెలుసు అక్షరానికి_అనునయించే కలం సాక్షిగా...!!
10. గమ్యాన్ని చేరుతోంది గమనం_బూటకపు బంధాలకు వెసులుబాటు కల్పిస్తూ..!!
11. ఏకాంతానికెందరు నేస్తాలో_ఆకాశంలో తారల లెక్క తేలనట్లుగా..!!
12. అవని ఆకాశం వెన్నెలమయం_చుక్కలకు దగ్గరైన ఏకాంతంలో..!!
13. దాచుకోవాల్సిన క్షణాలు కొన్ని_కాలం దోచేసిన జీవితంలో..!!
14. చీకటి స్వప్నంలో వెదుకులాడుతోంది_వెన్నెల్లో నీ జాడ కానరాలేదని...!!
15. గుండె నిండింది భావ మాలికలతో_అక్షరాలు అక్కున చేర్చుకోగానే...!!
16. కాలం చేతిలో కీలుబొమ్మలమే_అస్పష్ట చిత్రాలకు ఆకృతినీయలేక...!!
17. సందేశమెప్పుడూ సందేహాత్మకమే_అక్కరకు రాని అభాగ్యపు క్షణాల్లో....!!
18. నీడే నిజమైంది_తిమిరానికి వెలుగు పంచలేని అశక్తతలో...!!
19. మాయమయ్యింది మనసే_మౌనం నీతో చేరికైనందుకు...!!
20. మనసు పడింది మౌనంపైనే_మనల్ని చేరిక చేస్తోందని..!!
21. తడియారని సైకతరేణువునే_మనోసంద్రాన్ని తడుముతూ...!!
22. మౌనాలు మురిపాలే_మనసులొకటైన చెలిమికి సాక్ష్యాలుగా..!!
23. విరామానికి విశ్రాంతే లేదు_తడియారని స్వప్నాలు తలపులలో ఉంటే...!!
24. కలం కాలాన్ని సిరాగా ఒంపుకుంటుంది_అక్షరాలపై మనసు పడినప్పుడల్లా...!!
25. కలవరం కలత పడుతోంది_కలల్ని రానీయడం లేదని...!!
26. నేనే నువ్వైన కల_'కల'వరమై చేరికైనప్పుడు...!!
27. అక్షరాలు అలుముకున్నట్లున్నాయి_మనసు ఆర్ద్రత కనులకు చేరి..!!
28. మనసైంది మదికి_మన కథే ఇదని తెలిసి..!!
29. తప్పని వ్యధే ఇది_తరిగిపోతున్న అనుబంధాలకు సాక్ష్యంగా....!!
30. గెలిచింది నీ మౌనాన్నే_మనసుని కాదుగా
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి