రామానుజం మాస్టారి స్పందన నా అంతర్లోచనాలు పుస్తకంపై....
మనఃపూర్వక ధన్యవాదాలు మాస్టారు మీ అమూల్యమైన స్పందనకు, ఆశీస్సులకు...
తొలుత గా చిరంజీవులు మౌర్య , సౌర్య లకు శుభాశీస్సులు 🍇👐 అంతర్లోచనాలు 💎👀
మీ రచనల్లో ఓ మాధుర్యం ప్రత్యేకత ఏమిటంటే మన నిత్య జీవితంలో అనుభవాత్మక అంశాలే అయినప్పటికీ , విషయం ప్రాధాన్యం తో పాటు ముగింపు/ ముక్తాయింపు అనిర్వచనీయం.
పాఠకులను ఆకట్టుకుని , మనసుకు పదును పెట్టే విధంగా వుంటుంది.
మున్నుడి లలో శ్రీ కొంపల్లె శర్మగారు అందించిన భావప్రకటన, సూచనాత్మక విశ్లేషణ హృద్యంగా వుంది.
లేఖా గమనాల్లో
నేనింతే, మనసు గోల, ఇది నిజం, అమ్మ భాష, ఆలోచించండి, ఓ చేదు నిజం, ప్రయాణం లో పాడుగోల. ఇలా దేనికదే ప్రత్యేకత సంతరించుకుంది అంటే అతిశయోక్తి కాదు.
ఆ చదువులతల్లి కృప తోడై మీ మానసిక, శారీరక శక్తి ని పెంపొందిస్తుందని నా అభిప్రాయం.
మీరు ఎంచుకున్న రచనా వ్యాసంగం మీకు వరప్రసాదం గా భావిస్తూ అన్నిరంగాల్లో మీ కృషి ఫలించాలని ఆకాంక్షిస్తూ న్న మీ శ్రేయోభిలాషి...
రామానుజం
హృదయ పూర్వక శుభాభినందనలు.
మీరు కొన్ని సందర్భాల్లో విమర్శలతో ఎండగట్టి నా తగు పాళ్లలో వ్యక్తీకరించారు.
సాగరసంగమం పై మీకు గల మక్కువ నవరసభరితంగా మీ రచనల్లో ఆవిష్కరణ జరిగింది.
జీవితకాలం లో చేసే పుణ్యకార్యక్రమాల్లో గ్రంధరచన ఒకటి.
అందులో మీరు సఫలీకృతులయ్యారు.
ధన్యజీవీ ! శుభమస్తు 🍀
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి