"కథ చెబుతాను ఊ కొడతారా ఉలిక్కి పడతారా..." అంటూ పాట పాడను కాని ఓ విషయం చెప్పేద్దామని రాయడం మొదలెట్టేసాను. అందులోనూ ఏదైనా బుర్రలో చేరి తొలుస్తుంటే అస్సలు చెప్పకుండా ఉండలేని బలహీనత నాదయ్యే. నాకీ బలహీనత ఉన్నట్టే కొందరికి రక్తసంబంధ హీనత బాగా పెరిగిపోయింది. మాకు, మా పిల్లలకు ఉన్న సంస్కారం ఏంటంటే చంపడానికి శత్రువు మా ఇంటికి వచ్చినా పలకరించి మంచినీళ్లు తాగడానికి ఇవ్వడం. ఇది మాకు మా అమ్మానాన్నల నుండి, మేము చదువుకున్న గురువుల నుండి మాకు దక్కిన ఆస్తి. అదే అమ్మానాన్నల రక్తం పంచుకు పుట్టినా కొందరికెందుకో మరి ఈ సంస్కారహీనత. మమ్మల్ని మా పద్ధతులని అవహేళన చేసిన ఎందరికో ఇది నా మాటగా గర్వంగా చెప్తున్నాను. అమ్మ స్థానంలో, గురువు స్థానంలో ఉండి అనుబంధాలను, భావి భారత పౌరులను సరైన మార్గంలో పెట్టాల్సిన కొందరు రక్త సంబంధాల మధ్యనే గొడవలు పెడుతూ, విభజించి పాలించడమే తమ ప్రధమ కర్తవ్యంగా చేసుకుని, అబద్దాలు ఇంటిపేరుగా మార్చుకుంటుంటే చూస్తూ ఉండలేక నిజాలు చెప్పాలని ఉంది. ఆ నిజాలు తెలిసినా ఒప్పుకునే ధైర్యం లేక ఆ తప్పు అడుగులకు మడుగులు ఒత్తే నాకు తెలిసిన చాలామంది నా దృష్టిలో బతికున్నశవాలే. ఆపదలో ఓ ఓదార్పు మాట పలకలేని రక్త సంబంధం, అహంకారానికి మాత్రమే చిరునామాగా మారినా, కష్టంలో ఉన్నప్పుడు ఇంటికి రావద్దన్నా, ఆపదలో అవసరానికి కూడా తమ సంబంధాన్ని బయటపెట్టవద్దన్నా ఇలా మానసికమైన చర్యలెన్ని చేసినా తెలిసీ తెలియనట్టుంటూ నోరు విప్పని ఎందరో బంధుజనాలూ మీకు పాదాభివందనాలు. నేనంటూంటే చాలామందికి కోపం వస్తుంది కాని ఇదే నిజం ఏంటంటే.. " ఉపాధ్యాయ వృత్తిలో ఉండి పిల్లలకు మంచి చెడు చెప్పాల్సిన ఎందరో ఉపాధ్యాయులు అమ్మానాన్నల పట్ల, తోబుట్టువుల పట్ల చాలా హేయంగా ప్రవర్తిస్తూ నేతిబీరకాయలో నెయ్యి చందాన ఈ సమాజంలో బతికేస్తూ మానవ విలువలను పూడ్చి పెడుతున్నారు." సమాజం మారాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు కాని ఆ మార్పు మన ఇంటి నుంచే మొదలు కావాలని కోరుకోరెందుకో...?
6, మే 2019, సోమవారం
ఊ కొడతారా..ఉలిక్కిపడతారా...!!
నేస్తం,

వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి