1. ఏ రుచి ఎలా ఉండాలన్నది_నిర్ణయించేది కాలమే...!!
2. రసాస్వాదన రుచులకెరుకే_కాలంతో పోటిగా...!!
3. నా కన్నుల్లో నీ రూపే_మరో లోకమే లేనట్లుగా...!!
4. మనసు మాటల్లో వొలికినట్లుంది_అక్షరాల శబ్దానికి అనువుగా...!!
5. నీ ఊసుల మైమరపది_మనసాక్షరాలను మాయ చేస్తూ..!!
6. గమనమంతే అప్పుడప్పుడు గతి తప్పుతూ_మది కన్నీళ్ళకు ఓదార్పవుతూ...!!
7. వెలుగుతోంది మనసు_ఆత్మ జ్ఞానజ్యోతి ప్రకాశంతో..!!
8. రేపటి స్వప్నాన్ని_నిన్నలను దాటుకుంటూ నిశ్శబ్ధాన్ని ఛేదిస్తూ..!!
9. సమ్మెాహన రాగమేమెా అది_మౌనరాగానికి మరులు నేర్పుతూ...!!
10. కనుకొలుకుల్లో చేరిన కన్నీరు_మనసును తేలిక చేస్తూ..!!
11. ఓదారుస్తోందో అమ్మ_ఏ తల్లి కన్నబిడ్డైనా తనది అమ్మదనమేనంటూ...!!
12. మది జలపాతమది_కడలిలో కలిసి సాంత్వనందుతూ...!!
13. తనివి తీరని మమకారమది_మేఘమై మురిసిందిలా
14. మనసు పరిచయమేనేమెా_గుప్పెడు ఆత్మీయతను గురుతెరిగిన స్నేహానికి...!!
15. తక్కెడలక్కరలేని నెయ్యమది_కొలమానానికి చిక్కని బంధమై చేరి...!!
16. కష్టమంటే ఇదేనేమెా_నీవు లేకున్నా నీతోనే ఉన్నట్టుండటం...!!
17. దూరం కాలేని బంధం మనది_ఇష్టమైనా కష్టమైనా..!!
18. అక్షరాలు వెలవెలబోతున్నాయి_అర్థంపర్థంలేని రాతల్లో ఇమడలేక..!!
19. నిదురపోయిన నిజాలెన్నో_కలలో సైతం కలవరపడుతూ...!!
20. ఆరాధనే ఆలంబన అయ్యింది_బాధల బరువును మెాయడానికి....!!
21. అణుకువా ఎక్కువే నా అక్షరానికి_ఆత్మాభిమానం అలంకరణగా..!!
22. సొగసులీనుతున్నాయి_పూలు నేలరాలినా...!!
23. అమాస అగుపడనే లేదు_నీ నవ్వుల మెరుపు విరుపులను చూడలేకేమెా...!!
24. మనసుతో వినలేకపోతున్నాం_ఈ అక్షరాల ఆంతర్యాన్ని...!!
25. అక్షరం వయ్యారాలు బోతోంది_వెక్కిరింతలు తననేం చేయలేవంటూ...!!
26. మనసుకు తెలుసనుకుంటా_ఆప్యాయంగా ఆదుకునేవి అక్షరాలేనని...!!
27. అమ్ముడుబోని అక్షరం ఆత్మ విశ్వాసమది_చురకలేయడం తన వంతంటూ...!!
28. చురకలంటని చర్మమనుకుంటా_తోలు మందమని బుుజువు చేసుకుంటూ..!!
29. మూల్యం చెల్లించక తప్పదు కదా_మూలాలను వెక్కిరిస్తుంటే. ..!!
30. అన్యాపదేశం చేయదెప్పుడూ_కర్తవ్యమెరిగిన అక్షరం...!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి