నేస్తం,
ఉన్న వేదాలు, ఉపనిషత్తులు చాలు. మరో భారతమెా, రామాయణమెా రావాలని లేదు. మహాకవి శ్రీ శ్రీ గారన్నట్టు " ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం " అన్నది మనం ఒప్పుకోవాల్సిన సత్యం. తప్పని పరిస్థితి అయినా, తప్పించుకోలేని స్థితి అయినా రెండు చేతులు కలవనిదే చప్పట్లు వినబడవు, మరి అలాంటప్పుడు ఈ సమాజం ఒక్కరినే దోషిని చేయడమెంతవరకు సబబు? అనాది నుండి ఆడదానికి జరుగుతున్న అన్యాయానికి ఈ సమాజమిచ్చిన బిరుదు బరితెగించిన ఆడది అని. మగాడు తన అవసరాలు తీర్చుకుని నడిబజారులో వదిలేసినా ఏ తల్లి మనసు తన బిడ్డను కుప్పతొట్టెల పాలు చేయాలనుకోదు. మన దౌర్భాగ్యం ఏంటంటే చెత్తబుట్టల పాలైన బిడ్డలతో సహా సమాజమంతా ఆ తల్లినే నిందిస్తారు కాని తను మరణానికి చేరువౌతున్నా బిడ్డకు జన్మనిస్తూ సంతోషించే ఆ తల్లి మనసు కనబడదు. కుటుంబ బాధ్యత లేకుండా తిరిగే మగవాడికి కనకపు సింహాసనం, పాలు, మురిపాలు తీర్చే అమ్మకు, ఆలికి మనమిచ్చే గౌరవం ఏపాటిదో మీకందరికి ఎరుకే. ఈ ప్రపంచంలో చెడ్డ తండ్రి ఉంటాడేమెా కాని చెడ్డ తల్లి ఉండదు. బిడ్డ రోడ్లపాలు కావడానికి ఏ తల్లి కారణం కాదు. ప్రతి కవి, రచయిత తమ రాతలు ఎవరిని కించపరచకుండా నిజాయితీగా రాయగలిగినప్పుడే ఆ అక్షరాలకు సార్థకత.
23, మే 2019, గురువారం
అక్షరాలకు సార్థకత...!!
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి