అప్పులున్నాయని ఈరోజు కొత్తగా తెలిసిందా. పాలక పక్షానికన్నా ప్రతి పక్షానికే ప్రభుత్వ, ప్రజల సమస్యలు తెలిసుండాలి కదా. సమస్యలన్ని తెలుసుకుని వాటిని పరిష్కరిస్తారనే కదా అధికారమప్పజెప్పింది ప్రజలు. అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయకుండానే చేతులెత్తేయడం సబబు కాదండి. మన హక్కులు మనం సాధించుకోవడానికి ఎవరికి లొంగి బతకనక్కరలేదు. మీ స్వప్రయెాజనాల కోసం ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టకండి. వ్యక్తిగత కక్షలు,విమర్శలు మీ ఇష్టం. ఆంధ్రులను గురించి నోరు పారేసుకునే ఏ ఎదవను మేము ఉపేక్షించము. విభజన అప్పటి నుండి అందరికి అన్ని విషయాలు
తెలుసు. ప్రతిపక్ష పాత్రకు ఎలాగు న్యాయం చేయలేదు, కనీసమిప్పుడైనా మీకు అధికారం కట్టబెట్టిన జనం నమ్మకాన్ని నిలబెట్టుకోండి.
" అన్ని ఉంటే గుడ్డిది కూడ కాపురం చేస్తుంది " అన్న పెద్దలు చెప్పిన సామెత గుర్తు చేయక తప్పలేదు మీ మాటలు విన్న తరువాత. ఈ సామెత వాడినందుకు నన్ను మన్నించాలి అందరు. ఎవరిని కించపరిచే ఉద్దేశ్యం లేదు. సామెత గుర్తు చేసానంతే. యు టర్న్ తీసుకోకుండా పని చేస్తే చాలు.
28, మే 2019, మంగళవారం
ఆ మాట.. ఈ మాట...!!
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి