1. మెలకువ ఎక్కువే_కలలెక్కడ కలత చెందుతాయెానని...!!
2. దాయాలనే నా యత్నమునూ_గతి తప్పిన మనసును గదమాయిస్తూ..!!
3. ఏకాంతమెప్పుడూ సౌకర్యమే_అక్షరాంగనలకు ఆతిథ్యమీయడానికి...!!
4. సమయమెప్పుడూ అనుకూలమే_ఏకాంతమే శీతకన్నేస్తుంది అప్పుడప్పుడూ...!!
5. అక్షరాలెప్పుడూ దాపునే ఉన్నాయి_అలరించే భావాలే దూరంగా...!!
6. అనంత సాగరమే మది_జీవితపు ఆటుపోట్లకు గురౌతూ...!!
7. నిత్య విద్యార్థులమే జీవిత పాఠశాలలో_ఆటుపోట్ల ఆటస్థలాన్ని నింపేస్తూ...!!
8. గొడ్రాలితనమే కోరుకుంటోంది_అమ్మగా మారి నికృష్టులకు జన్మనీయడంకన్నా...!!
9. అక్షరాలతో ఆంతరంగికమే ఎప్పుడూ_పద సంపద పొర్లుపోనీయకుండా..!!
10. వగరు వలపులెన్ని వచ్చి చేరాయెా_నెచ్చెలితో నెయ్యానికి...!!
11. ప్రబంధమెప్పుడూ పరిచయమైనదే_ప్రణయమే సరికొత్తగా చేరుతుందంతే...!!
12. అర్థమైన అంతరంగాన్నే నేను_రహస్యానికి తావీయక...!!
13. అన్ని రుచుల అనుబంధమే మనది_గతజన్మ బుుణానుబంధమై...!!
14. చెమరింతలే చేవ్రాలుగా మారిన క్షణాలు_అక్షరాలకు అంకితమిస్తూ...!!
15. ఓరిమి వహిస్తూ ఒదిగిపోవాలిక_పదాలకు ప్రాణం పోయాలంటే..!!
16. నిశీధి నేస్తమయ్యింది_నీ తలపులను నాకందిస్తూ..!!
17. అనంతానికందనివే మనసు భావాలు_అక్షరాలకు దొరికిపోతూ..!!
18. అండదండలు పుష్కలమే_అక్షర సమర్పణే అన్యాక్రాంతమౌతూ..!!
19. గెలుపుబాట పరుస్తున్నాయి_ఓరిమిని వరించిన అక్షరాలు...!!
20. నిశీధి చిత్తరువు చెదిరిపోయింది_చెలిమి మెరుపు తాకిడికి...!!
21. అక్షరాలకెప్పుడూ ఆనందమే
అందాన్ని అభివర్ణించడానికి...!!
22. రాతల్లో ఇమడ్డం కొత్తేమి కాదు అక్షరాలకు_నిన్ను తలపిస్తున్నందుకే ఆ వన్నెలు...!!
23. తడబాటు తప్పడం లేదు_తప్పుటడుగులకు మడుగులొత్తేటప్పుడు...!!
24. అపురూప భావాలు_అనంతాన్ని మనకందిస్తూ..!!
25. నాయకులు నిమిత్తమాత్రులు_కట్టేది కూల్చేది ప్రజల సొమ్ముతోనే...!!
26. ఆత్మశోధనే మార్గం_మానసిక పరిణితిని తెలుసుకోవడానికి...!!
27. ప్రతి పరిమళమూ ఒక అనుభూతే_మది ఆస్వాదను అనుసరిస్తూ...!!
28. చుక్కలు శూన్యాన్నలంకరిస్తున్నాయి_చీకటికి సాయం చేయాలంటూ...!!
29. ఈ వెన్నెల జలతారే ఆశ పెడుతోంది_చీకటి బతుకులో వెలుగు నింపుతానంటూ..!!
30. మెాయక తప్పదు_మనసు భారమెంతున్నా..!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి