నేనేదో జగన్ ని అంటున్నానని వారి అభిమానులు నాపై చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు. ఏ ప్రభుత్వం ఎంత అవినీతి, అక్రమాలు చేసింది, చేస్తుంది అన్నది జగమెరిగిన సత్యం. జగన్ నా శత్రువు కాదు, బాబు నా మిత్రులూ కాదు. కాని కే సి ఆర్ మాత్రం నాకు ఆజన్మ శత్రువే. తెలంగాణా మిత్రులు గమనించాలి ఇక్కడ కె సి ఆర్ మాత్రమే నా శత్రువు. ఎందుకంటే ఆంధ్రులను కూసిన కారు కూతలకు కాని, వాడిన పదజాలానికి కాని నాకెప్పటికి శత్రువే. ఆంధ్రులందరకు శత్రువని అనలేదు. గమనించగలరు. నాకు శత్రువయినా నేను ఓ విషయంలో మెచ్చుకోకుండా ఉండలేను. దీక్ష అంటూ మెుదలెడితే సాధించాలి లేదా చచ్చిపోవాలంతే.
3000 కిలోమీటర్ల పాదయాత్రలు చేసి ప్రజల కష్టాలను తెలుసుకున్నారని ఇప్పుడే టి వి లో విన్నాను. మరి సామాన్యుడి కష్టాలను తీర్చడంతో మీ పాలన మెదలు పెట్టారా. ఒక రోజు దీక్షలు, పాదయాత్రలు, సైకిల్ యాత్రలు, ఓదార్పు యాత్రలు మీరు లెక్కలేసుకోవడానికి తప్ప మరెందుకు పనికిరావని మనవి. వాడు కట్టింది వీడు కూల్చి, ఎవరి అవినీతెంతో లెక్కలు వేసి హమ్మయ్య అని చేతులూపుకుంటూ, జనాలకు చూపడానికి కాదు. మీ పాలన సరైనదైతే జనం బ్రహ్మరథం మీకే పడతారు. ఊరికే టి వి లో పేపర్లూపుకుంటూ చెప్తే చాలదు. అవినీతి, అక్రమాలు చేయకుండా నిజాయితీగా ఎవరి సంపాదన ఎంతో ఎవరి మనస్సాక్షికి వారికే తెలుసు.
నేను మీరు చెప్పారు కాబట్టి అడుగుతున్నాను.. ప్రతిపక్షంలో ఉండి అప్పటి అవినీతిని చూస్తూ ఎందుకు ఊరుకున్నారు. మీ పాదయాత్రల్లో మీరున్నారు. కక్ష సాధింపు చర్యలు కాదు.. జనం మర్చిపోతున్నారు స్పెషల్ స్టేటస్ గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి దృష్టి పెట్టండి.
మరో విషయం నాకు కులగజ్జి అనుకునేవాళ్ళెవరయినా నన్ను అన్ ఫ్రెండ్ లేదా బ్లాక్ చేసుకోవచ్చు. విమర్శ సహేతుకంగా లేని ఎవరినైనా నేను బ్లాక్ చేస్తాను. కామెంట్లు తీసేస్తాను. నేను ఎప్పుడూ ఎవరి గోడ మీద వారి అభిప్రాయాలకు విరుద్దముగా కామెంట్ పెట్టలేదు. ఎదుటివారి అభిప్రాయాలను గౌరవించండి.
ధన్యవాదాలు
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి