1. గోప్యత గుట్టుగానే ఉంది_ఏ బంధం ఎలా ముడిపడుతుందో తెలియక...!!
2. రెప్ప తెరవలేకున్నా_కన్నుల మాటు నుండి కనుమాయమౌతావని..!!
3. తోబుట్టువులైనా తోడు రాని రోజులివి_కాలానికి కనికరమేలా...!!
4. తప్పని బాధ్యతలే ఇవి_తప్పుకోలేని బంధాల నడుమ...!!
5. పై పై అలంకరణలదేం ఉందిలే_అలంకారాలతో కూర్చిన అక్షరాలుండగా...!!
6. పదబంధాలంతే మరి_అక్షరాలకు అభినయం నేర్పేస్తుంటాయలా...!!
7. పదాలన్నీ పారాడుతున్నాయి_పసితనపు అల్లరి గుర్తొచ్చింది కాబోలు...!!
8. పరాజయానికి పంతమెక్కువ_గెలిచి చూపిస్తుంది...!!
9. నా అక్షరాలకు తెలుసు_నన్నెలా చూపాలో..!!
10. వీధికుక్కకి విశ్వాసమెక్కువ_మృగరాజుకి మృగత్వమే జాతి లక్షణం మరి..!!
11. జీవిత పుస్తకమే అంత_అనుభవాల పుటలతో పేజీలు నింపేస్తూ..!!
12. సుతారంగా మీటానందుకే_ఉలికిపడి నిదుర లేస్తావని...!!
13. లిఖితమే సరిలేదు_ఎన్నో ఇజాల నిజాలను లిఖించాలన్న కోరికున్నా..!!
14. కలకు మెలుకువ వచ్చిందట_ఇలలో నీతో ముచ్చట్లాడాలని...!!
15. కలలు లేని జీవితమిది_ఎల్లలుండని సంద్రాన్ని దాటాలనుకుంటూ...!!
16. కదిలించే కథలెన్నో_కనిపించని మనసుల వెనుక..!!
17. మాటలెక్కువయ్యాయి_మనసు కుదుటబడి..!!
18. మాసిపోని చెమరింతలే అవి_తడిమే గురుతులకు ఓదార్పునిస్తూ...!!
19. వినిపించని వేదనలెన్నో_చిరునవ్వు మాటున దాగుండి..!!
20. మనసు జ్వలనమెా నిరంతర ప్రక్రియ_అక్షరాల హారతిలో...!!
21. కోతలెక్కువయ్యాయి_అధికారమిచ్చిన అహంతో..!!
22. అక్కరకు రాని అనుబంధాలెన్నో_మక్కువలకు మారు మాట చెప్తూ..!!
23. అక్షరాలు కుదురుగా ఉండట్లేదు_గాయాలను గేయాలుగా మలిచే వరకు..!!
24. అర్ధనారీశ్వర తత్వానికే అవమానం_తామేంటో తెలియని ముఖాలకి...!!
25. ఆకాశం ఘనీభవించింది_విషపు కోరల వత్తిడికిలోనై...!!
26. భరించలేని రోదనలే అన్నీ_మౌనం మాట్లాడితే...!!
27. నిరంతరాయంగా శ్రమిస్తోంది శరీరం_మానసిక రోగుల స్వస్థతకై....!!
28. వ్యధల ఉరవడి ఎక్కువైంది_వనవాసానికి చేరిన వనితకు..!!
29. అక్షరాల ఆంతర్యమది_భావాలకు మాత్రమే అవగతమౌతూ...!!
30. అలవాటైతే చాలు_అక్షరాలు అల్లేసుకుంటాయి అలవోకగా..!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి