1. ఆరాధనకు బానిసనంటోంది మనసు_మరో మాటకు తావీయక..!!
2. కరిమబ్బులు కరిగిపోతాయి_వాస్తవాలద్దుకునే వర్ణాల ముందర...!!
3. నిర్లిప్తత మనసుకెందుకు_గుండెను వీడని గాయాలను అక్షరాలకందించు..!!
4. రాతిరికెప్పుడూ మెలకువే_వేకువను ఏమార్చే ప్రయత్నంలో...!!
5. అలుక తెలియని అక్షరాలవి_ప్రతి క్షణమూ నా చేతిలో నర్తిస్తూ...!!
6. కలతల కాలానికి చెల్లు_భయానికి వెరవని మదికి...!!
7. భద్రపరుచుకోవాలన్న తాపత్రయమే అది_దాయలేని క్షణాల దాపరికాన్ని...!!
8. యాతన మనసుదైనందుకేమెా_దాగని ఆక్రోశమై దశదిశలా వ్యాపించేస్తూ...!!
9. ఏకాంతానికెప్పుడు ఎడదతో స్నేహమే_మాట మౌనంతో పని లేకుండా...!!
10. అనర్హులకే అందలాలు మరి_అసలైన అక్షరాన్ని గుర్తించలేక..!!
11. కాలానికెప్పుడూ ప్రసవ వేదనే_క్షణాల సంవేదనని మెాస్తూ...!!
12. మంతనాలు మధ్యస్థంగా ఆగిపోయాయి_మనసైన ఏకాంతం మరుగయ్యిందని...!!
13. విశేషమైన ఊసులవి_సశేషమైన బాసలను సంతృప్తి పరుస్తూ...!!
14. శూన్యమూ నచ్చేసింది_శేషాలతో పని లేని మరో ప్రపంచమైనందుకు...!!
15. చతురత ఎవరిదైతేనేమి_అక్షరాలకది ఆటవిడుపు..!!
16. విషాదాలకు విరామమే_చతురత శూన్యానిదైతే...!!
17. బాసలన్నీ బాధ్యతలని గుర్తు చేస్తున్నానంతే_ఊహలు ఊతమిస్తాయంటూ...!!
18. పరిభ్రమణం నీ చుట్టూనే_అవశేషం నేనైనా...!!
19. లెక్కలు తేల్చలేని సందిగ్ధమది_మనమైన నిశ్శేషంలో..!!
20. అవసరానికి అనుబంధమక్కర్లేదు_ముసుగుతత్వం మనిషి నేర్చుకున్నప్పుడు...!!
21. వెలిసిన రంగులకు కొత్త వర్ణాలద్దటమే_బతుకు భయమైనా భారమైనా..!!
22. తప్పించుకోలేని బాధ్యత ఇది_బతకడం అనివార్యమనైనప్పుడు..!!
23. అమ్మకు లేదుగా ప్రత్యామ్నాయం_బంధాలను మెాసే బాధ్యత తనదని తెలిసి...!!
24. అనుబంధపు ఆస్వాదన తెలియని మనసది_ఇక అవగాహనేం ఉంటుంది...!!
25. అతిశయం ఎక్కువే మరి_అక్షరాలు నా ఏకాంతపు నేస్తాలని..!!
26. అజ్ఞాతం అవసరమే రాలేదు_అంతరంగం నీకు తెలిసాక...!!
27. దాయాలన్నా దాయలేని గాయమిది_యాతన మనసుదైనందుకేమెా...!!
28. తిరుగుబాటు తప్పనిసరి_అవసరాల ముసుగులపై..!!
29. బాలారిష్టాలు దాటని బాల్యమే_కాలం చేతిలో కీలుబొమ్మగా...!!
30. ముగింపు దొరకని సశేషాలే అన్నీ_నే రాసుకున్న కథైనందుకేమెా...!!
1 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
మీరు రాయటం మొదలు పెట్టండి. మొదట్లో నా వల్ల కాదు అనిపిస్తుంది. అలా అనిపిస్తే మీరు సరైన మార్గంలో ఉన్నట్లే.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి