12, సెప్టెంబర్ 2020, శనివారం
ప్రచ్ఛన్న వస్తుశిల్పాల పుస్తకం గురించి...
నేస్తాలు,
రచన పుట్టుక, పూర్వోత్తరాల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పక చదవాల్సిన పుస్తకం ఒకటుంది. రచయిత పుస్తకాన్ని ఆవిష్కరించడం కాదు. పుస్తకమే రచయితను ఆవిష్కరిస్తుందనడానికి ప్రత్యక్ష సాక్ష్యం ఇదిగో ఇప్పుడు మీ ముందట..
విలక్షణ రచయిత, విమర్శకులు అయిన సాగర్ శ్రీరామ కవచం రచించిన " ప్రచ్ఛన వస్తుశిల్పాలు " పుస్తకం.
నిజంగా చెప్పాలంటే నాకు చిన్నప్పటి నుండి పుస్తకాలు చదవడం మాత్రమే తెలుసు. రాయడం అనేది అప్పటికప్పుడు ఏదనిపిస్తే అది రాయడమే తెలుసు. రచన ఎలా జనిస్తుంది? ఎన్ని వైవిధ్య భరిత రూపాలు సంతరించుకుంటుంది? రచయితకు ఉండాల్సిన లక్షణాలు, రచనలోని లోతుపాతులు ఇలా ఎన్నో మనకు సారి నాకు తెలియని విషయాలను ఈ పుస్తకం ద్వారా తెలుసుకున్నాను.
సాగర్ అంకుల్ ముందు మాటలు రాయమంటే భయపడ్డాను కూడా. అంకుల్ ప్రోత్సాహంతో నేను నాలుగు మాటలు రాశాను. నాకు ఇంత అరుదైన అవకాశం ఇచ్చిన సాగర్ అంకుల్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఈ పుస్తకం గురించి ఒక్క మాటలో నాదైన శైలిలో చెప్పాలంటే...
" వస్తువు ఆత్మ లాంటిదైతే, శిల్పం జ్ఞానంవంటిది " అని చెప్పాలనిపించింది.
రచన గురించి తెలుసుకోవాలని కాని, నేర్చుకోవాలన్న తపన కాని ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన పుస్తకం ఇది.
సాహిత్య చరిత్రలో ఎన్నడూ, ఎవరూ రాయని, రాయలేని పుస్తకం ఇదని ఘంటాపథంగా చెప్పగలను. గుర్తింపు అనేది ఎలా వస్తుందో ఈ పుస్తకం ద్వారా తెలుస్తుంది. న్యాయంగా ఏ అధికారాలకు, రికమండేషన్లకు తలొగ్గకుండా ఉంటే అత్యున్నత పురస్కారం దక్కాల్సిన పుస్తకమని చదివిన అందరికి తెలుస్తుంది...
పుస్తకం చదివి చెప్పండి నా మాటలు నిజమెా కాదో...
వెల కట్టలేని సాహితీ సంపదను అందించిన సాగర్ అంకుల్ కి అభినందనల శుభాకాంక్షలు...
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి