12, సెప్టెంబర్ 2020, శనివారం
ఏక్ తారలు..!!
1. బంధాలను సవాలు చేస్తున్నాయి ఆర్థికావసరాలు_అలంకారం అక్షరాలకంటూ..!!
2. అక్షరమెంత ఆలంబన_మౌనానికి మాట నేర్పుతూ...!!
3. గడుసుదనమంతా అక్షరాలదే_మనసును మౌనాన్ని మాటల్లో మురిపిస్తూ...!!
4. ఆశల వలయాలు చుట్టుముడుతున్నాయి_రాతిరికి విరామమీయ రాదంటూ..!!
5. వీడని బంధమే మనది_తరగని చెలిమి పరిమళంలా..!!
6. గాయమెప్పుడూ అంతే_కలత పెడుతూనే వుంటుంది మనసుని..!!
7. మనసుకు మరణం లేదనే కదా_శాశ్వతంగా అక్కడే కొలువు దీరాలనుకున్నా...!!
8. తేలాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాం_మునిగిపోయి ఊపిరాడకే...!!
9. మెుక్కవోని ఆత్మస్థైర్యమిది_రెక్కలెన్ని తెగిపడుతున్నా ఓటమినొప్పుకోక..!!
10. కోరిక తీరనేలేదు_మూగబోయింది పాడుతా తీయగా..!!
11. అయినవాళ్ళనే ఆదమరుపది_పరాయితనమని పరాకు పడకు...!!
12. ఎన్ని కన్నీళ్ళను దాచేసిందో గుండె_అక్షరాలను చెరిపేస్తూ..!!
13. ఎన్ని వెలుగులను చిమ్ముతుందో అక్షరం_మనసు కన్నీళ్ళతో నిండినా...!!
14. ఎన్ని కలలకు కారణమౌతుందో అక్షరం_కలతలను ఏమార్చుతూ...!!
15. అక్షరమై హత్తుకుంటున్నా_మదిలోని వేదనకు సాంత్వననీయాలనుకుంటూ...!!
16. అనుబంధమై అల్లుకుంటున్నా_ఆత్మీయత పంచే అక్షరాలనొదల్లేక...!!
17. అక్షరానికి తప్పని బంధుత్వమే మరి_మాటకు మౌనానికి మధ్యన...!!
18. పోరాటమెప్పుడూ గెలుపు కోసమే_అది అక్షరంతోనైనా ఆయుధంతోనైనా...!!
19. అదేంటో అడిగితే కాదనలేను_అరువు ఇవ్వద్దనుకుంటూనే...!!
20. ఆత్మవంచనే ఆస్తిగా మారింది_ఈ ఆధునిక జీవితాల్లో...!!
21. బాధ్యతలు వెంబడిస్తున్నాయి_బతుకు అర్థం మరవొద్దంటూ...!!
22. అనుభవాలన్నీ అక్షరాలతోనే_పంచుకోవడం అలవాటయ్యాక...!!
23. మర్చిపోవడం అలవాటు చేసుకుంటున్నా_బంధాలు భయపెడుతుంటే...!!
24. మానని గాయమే అది_ఎడబాటు ఎదని సలుపుతున్నా..!!
25. కల చీకటిని వెదుకుతోంది_వెన్నెల్లో తన ఉనికి కనబడదేమెానని...!!
26. సాధనకు అంతరాయం కలుగుతోంది_సహజత్వం నశిస్తుంటే...!!
27. వాస్తవాలను రాయడం కష్టమే_ అవి మరపు తెలియని జ్ఞాపకాలైనా...!!
28. అమెాదం అవసరం లేదు_అంతరాత్మకు సమాధానం చెప్పగలిగినప్పుడు..!!
29. వెన్నెల వర్ణమైపోదూ_నువ్వు చీకటి చీర చుట్టుకున్నప్పుడల్లా...!!
30. వానతో వరదా వచ్చెళ్ళింది_జ్ఞాపకాల గాయాలను గుర్తుంచుకోమంటూ...!!
వర్గము
ఏక్ తార
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
Nice.... Nice words..
Archana latest images
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి