3, ఆగస్టు 2024, శనివారం

అలసిన వాక్యాలు..!!

అడుగులు తడబడిన 

అక్షరాలు కొన్ని 

తప్పిపోయాయి


తప్పటడుగులతో 

గమ్యాన్ని చేరలేమన్న 

నిరాశలో మునిగిపోయాయి


మాటలకు వ్యాకరణాల

అలంకారాలు అక్కర్లేదంటూ

గదమాయిస్తున్నాయి


తెలియని దారుల్లో

పరమపద సోపానాలు

ఎదురుపడుతున్నాయి


కాలం విసిరెళ్లిన

గా(వ)లపు వలకు

చిక్కుబడ్డాయి


ఓ క్షణమయినా సేదదీరడానికి

అలసిన వాక్యాలు 

కొన్నయినా చాలంటున్నాయి..!!




0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner