
అంధకారంలో పడిన మనసుకి
అక్షరాల ఆకారం ఆడ మరచిపోతే....!!
అక్షరాలతో అల్లిన పదాల అమరిక
కనిపించక పోవడంలో వింత ఏముంది....!!
ఎదురుగా ఉన్న నిన్నే చూడలేనప్పుడు...
ఏకాంతంలో నీతోనే ఉన్నానని చెప్పినా వ్యర్ధమే కదూ...!!
అర్ధం కాని ఆవేశం నీ కోసమే...అంటూ...
అటు ఇటు పోతూ...నీకు దూరంగా జరిగితే...!!
ఎనలేని ఇష్టమంటూ నువ్వెళితే...
ఎక్కడో నీ కోసం నే వెదుకుతున్నానంటే....!!
అయినా ఇష్టం పోదెందుకో మరి....!!





