11, డిసెంబర్ 2012, మంగళవారం
10, డిసెంబర్ 2012, సోమవారం
9, డిసెంబర్ 2012, ఆదివారం
8, డిసెంబర్ 2012, శనివారం
వెదుకులాటలో......!!
అందని హద్దు ఆకాశం అయినా అందుకోమంటూదగ్గరగా రా రమ్మంటూ ఆహ్వానం పలుకుతూ
మురిపిస్తూ మెరిపిస్తూ దగ్గరైనట్లే అనిపిస్తూ
దూరం దూరం పోతూనే ఉంటుంది...అచ్చం నీ లానే...!!
ఇదిగో ఇక్కడే ఉంది ఆవలి తీరం అంటూ...
అంతే లేని తీరం తెలియని సంద్రంలా...ఉన్న నీ మదిలో....
వెదుకుతూనే ఉంటుంది కనపడని తీరాన్ని
చేరాలనే తపనతో....అర్ధం కాని నీ మనసు
కలశంలో ఓ చిన్ని బిందువులా నా జ్ఞాపకం...
దాగుందేమో అని చిరు ఆశతో...!!
ఆనవాలు ఏమైనా దొరుకుతుందని తపనతో...!!
మరి దొరుకుతుందో....!! లేదో....!!
వర్గము
కవితలు
4, డిసెంబర్ 2012, మంగళవారం
ఈ మాటని చెప్పారేమో....!!
పెరటి చెట్టు ఇంటి వైద్యానికి పనికిరాదని అందరికి తెలిసిన పెద్దలు చెప్పిన సామెత కదా....!! ఇది నిజం అంటాను నేను....కాదనే వాళ్ళు చేతులెత్తండి...ఎంత మంది నాకు ఓటేస్తారో చూసి...దానిని బట్టి నేను రాజకీయాల్లోకి వెళ్లి... పార్టి పెట్టి కాస్త సొమ్ము సంపాదిన్చుకుందామని ప్లాను....ఎవరికీ చెప్పకండేం...!! మళ్ళి నాకు పోటి ఎక్కువైపోతుంది...!!
సరే మరి...చేతులెత్తితే నాకు కనపడి ఛావదు కదా అందుకే కామెంట్లు పెట్టేయండి.....!!
ఎంత గొప్ప వైద్యుని వైద్యమైనా ఇంట్లో పనికిరానట్లే..!!
ఎంత గొప్పవారైనా పదిమందికి మంచి చేసినా ఇంట్లో పనికిరానివారే....!!
అందరికి నచ్చినా ఇంట్లోవాళ్ళకి నచ్చని వారే....!!
ఇలాంటివి అన్ని చూసే మన పెద్దలు ఈ మాటని చెప్పారేమో....!!

కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)