ఆ మధ్యెప్పుడో నాకు ప్రతిఘటనలోని పాట గుర్తు వచ్చింది.. ఈ దుర్యోదన దుశ్శాసన ....కలియుగానికి ఆరవ వేదం కూడా చాలదేమో అనిపిస్తోంది.. ఈ వాట్స్ప్ లు ముఖ పుస్తకాలు వచ్చాక మనతో మనం గడిపే సమయం కూడా తగ్గిపోయినట్లుగా ఉంది.. సమయం, సందర్భం లేకుండా ఫ్రెండ్ అని ఆడ్ చేస్తే చాలు టాగ్ లు , గుడ్ మాణింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ ... మధ్యలో ఇంకా ఏమైనా ఉంటే అవి కూడా... పని ఏమి ఉండదో మరి ఏమో ...వయసుతో అస్సలు పనే ఉండదు .. ఇదో గోల అనుకుంటే ఈ యాప్ లతో ఒక గోల ... సరదాగా తీసుకోండి సరదా యాప్లని ... మనం అనే ఒక చిన్న మాట ఎదుటి వారిని ఎంతగా బాధ పెడుతుందో మాట అనే ముందు ఆలోచించండి.. ఈ ప్రపంచంలో అందరు ఏదో ఒక ఇబ్బందిలో ఉన్నవారే.. మనకు మనదే పెద్ద కష్టం కావచ్చు .. ఎప్పుడయినా మనకు మన బాధ్యతలు, ఈ జీవితంలో మనతో ముడి వేసుకున్న బంధాలు ముఖ్యం... వాటి తరువాతే ఏ ఇతర అనుబంధాలు అయినా.. సాధ్యమైనంత వరకు అందరిలో మంచినే చూద్దాం... ఈ సంవత్సరం మిగిల్చిన చేదు జ్ఞాపకాలను వదలి వేయడానికి ప్రయత్నిస్తూ మరో అడుగు ముందుకు వేద్దాం...!!
30, డిసెంబర్ 2015, బుధవారం
మరో అడుగు ముందుకు వేద్దాం... !!
నేస్తం...

వర్గము
కబుర్లు
శుభాభినందనలు.... !
నా ఆత్మీయురాలు కాట్రగడ్డ భారతి గారు "వెన్నెల పుష్పాలు" కవితా సంపుటి ఆవిష్కరణ ... అదే రోజు సావిత్రి బాయి ఫూలే విశిష్ట సేవా పురస్కారాన్ని అందుకుంటున్న శుభ సందర్భంగా ఇవే మా మనః పూర్వక శుభాభినందనలు....మరెన్నో కవితా సంకలనాలు వెలువరిస్తూ .. వారి సమాజ సేవకు తగిన అవార్డులు.. రివార్డులు ... అందుకోవాలని కోరుకుంటూ.... రాబోయే సంవత్సరం కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ...
ఆత్మీయ నేస్తం
మంజు
వర్గము
శుభాకాంక్షలు
28, డిసెంబర్ 2015, సోమవారం
వెనక్కు పంపడంలో అంతరార్ధం ఏమిటి..?
ఒకప్పుడు చదువుకోవడానికి వీసాలను ఇవ్వడం కష్టతరం చేసిన అమెరికా ఇప్పుడు వారి ఆర్ధిక వనరులను పెంచుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా అది మన భారత దేశంలో ఉన్నంత అమెరికా పై మోజును ఎలా సొమ్ము చేసుకుంటోందో.. ఇక్కడ వీసాలు ఇచ్చేటప్పుడు వారికి తెలియదా అవి మంచి యూనివర్సిటిలు అవునో కాదో ... వీసా ఇచ్చినట్టు ఇచ్చి అన్ని రకాలుగా డబ్బులు చేసుకుని వెనక్కు పంపడంలో అంతరార్ధం ఏమిటి..? తానా స్వేర్ లు పెద్దలు చాలా మంది చాలా సలహాలు సూచనలు ఇస్తున్నారు ... అవి అన్ని వీళ్ళ కన్నీళ్ళు తుడవవు అని వారికి తెలుసు .. ఇంతకూ ముందు కూడా ఒకప్పుడు F1 వీసాలు ఇవ్వకుండా నిబంధనలు కష్టతరం చేసారు అది ఒకరకం .. అక్కడకు వెళ్ళిన తరువాత వెనక్కు పంపడంలోఅమెరికా అంతరార్ధం ఏమిటి.. మన తెలుగు వాళ్లకు ఎంత చెప్పినా దూరపు కొండలు నునుపు ... నేను అక్కడ చూసిన చాలా చదువుల తరువాత వారు ఇప్పటికి కనీసం మంచి ఉద్యోగాలు చేయక వేరేగా స్థిరపడిపోయారు... నేను H 1 వీసా తో వెళ్ళాను .. నేను చాలా ఇబ్బందులు పడ్డాను మంచి కంపెని అని నమ్మి .. ఇక్కడ ఆ నిజాలు చెప్పేసాను అనుకోండి నామీద యుద్ధం ప్రకటిస్తారు అందరు...ఇంకో నాలుగు నెలలు పొతే H 1 లాటరీ మోజు మొదలౌతుంది .. అది కూడా ఇదే స్థితి ... డాక్యుమెంట్స్ లేకుండా వీసాలు ఎలా ఇచ్చేస్తారు ... ట్రావెల్స్, అమెరికా కలిసి చేస్తున్న వ్యాపారం ఇది .. మనకు అమెరికా మోజు తీరనంత కాలం వీళ్ళు మనతో ఇలానే ఆడుకుంటారు ... ప్రభుత్వం లేఖలు, తానా కబుర్లు ఇవి అన్ని ఎందుకు ఉపయోగపడవు ... అమెరికాకు ఈ ఆటలు అలవాటే ఏదో ఒక వీసాతో ఇలా ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటారు ... నిజం చెప్పొద్దు మనకు గొప్పలు చెప్పుకునే అలవాటు అందరికన్నా ఎక్కువే కదా అందుకే ఈ తిప్పలు ... ఇంట గెలవడం ఎలాగు రాదు రచ్చ అభాసు పాలౌతున్నాం మనకున్న డాలర్ల పిచ్చిలో పడి ... గాస్ స్టేషన్లో గంటకు పది డాలర్లు సంపాదించి అదే జీవితం అనుకుంటూ ఇక్కడేమో మా అబ్బాయి అమెరికాలో పెద్ద ఉద్యోగం అంటూ చెప్పుకు తిరిగే తల్లిదండ్రులకు ఈ సంఘటనలు కనువిప్పు కావాలని కోరుకుంటూ .... M.S కాదు మీలో సత్తా ఉంటే ఇక్కడ రాంక్ సంపాదించండి ... అమెరికా వలసలు కొన్ని రోజులు ఆపండి ... !!
వర్గము
కబుర్లు
26, డిసెంబర్ 2015, శనివారం
ఎందరో స్త్రీమూర్తులు....!!
అణువుకు ఆకృతినిచ్చిసృష్టిలోని మాధుర్యాన్ని పంచే
తల్లి ప్రేమకు దాసుడైనాడు
ఆ పరమాత్ముడే మానవజన్మను ధరించి
వంటింటి కుందేలన్నారు ఆనాడు
సప్త సముద్రాలను సుళువుగా దాటుతున్నారీనాడు
గగనాన తారకలౌతున్నారెందరో
చరిత్రలో చిరస్థాయిగా మిగులుతున్నారు
ఆత్మవిశ్వాసానికి చిరునామాలుగా నిలుస్తున్నారు
ఇంటా బయటా నిత్య జీవన రణరంగంలో
అలుపెరుగని శ్రామికులుగా చెరగని చిరునవ్వుతో
మొక్కవోని ఆత్మ స్థైర్యంతో నిలబడుతూ కూడా
అహం మృగం చేతిలో అణగద్రొక్కబడుతూ
విజయాన్ని అందుకునే యత్నంలో
సహనాన్ని , ఔదార్యాన్ని మరువక
కాలంతో పోటీపడే ఆ స్త్రీమూర్తుల
ఓరిమికి మీ "అమ్మ" నేర్పిన "సంస్కారం"
మీలో ఉంటే చేతులెత్తి నమస్కరించండి...!!
వర్గము
కవితలు
20, డిసెంబర్ 2015, ఆదివారం
అసలు సమస్య....!!
కార్పోరేట్ స్కూల్ /కాలేజ్ అన్న పదం వస్తే చాలు వెంటనే తల్లిదండ్రులని అనడం పరిపాటి అయిపొయింది అసలు సమస్యను వదిలేసి.. ఏ తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు అధోగతి పాలు కావాలనో లేదా తమ కళ్ళ ముందే చనిపోవాలనో కోరుకోరు.. పిల్లల అవసరాలు తీర్చడం కోసమే వారు జీవితాన్ని పణంగా పెడుతున్నారు... నేను వారంలో 4 రోజులు వెళ్లి వస్తూనే ఉంటాను అక్కడ ఎంతోమందిని చూస్తూ ఉంటాను ... తల్లిదండ్రులు పిల్లలను మార్కుల కోసం, రాంకుల కోసం ఇబ్బందులు పెట్టరు .. ఈ పిల్లలే కనీసం ఇంట్లో ఉన్నప్పుడు ఓ నిమిషం అమ్మానాన్నలతో మాట్లాడే తీరిక ఉండదు కాని ఇప్పుడు మాత్రం ఫోను కనిపిస్తే వదలరు .... ఇక చనిపోయిన హృతిక్ విషయానికి వస్తే ఇద్దరు పిల్లలు మీడియాకు వైస్ ప్రిన్స్ పాల్ వేధింపు కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్తే అది మీడియా వాళ్ళు ఎందుకు రానివ్వలేదు ... పిల్లలు చదవలేదు అన్నది కారణం కాదు వాళ్ళు గుడివాడ గౌతమ్ స్కూల్ పిల్లలు .. వాళ్ళు ఆడుతూ పాడుతూ చదువుతారు ... మా పిల్లల సంగతి మాకు బాగా తెలుసు ... ఎలాంటి వాళ్ళు అన్నది .. ఈ రోజుకి కూడా కే కే ఆర్ గారు మా వాడు కనిపిస్తే పలకరిస్తారు అంటే అర్ధం చేసుకోండి అలా అని మాడు మొదటి సెక్షన్స్ లో ఉండడు .. ఈ హృతిక్ కూడా అలాంటి వాడే .. వాళ్ళ అమ్మా నాన్నలకు చెప్పలేని విధంగా చేసాడు అంటే నాకు ఏదో అనుమానంగా ఉంది ఆ వైస్ ప్రిన్స్ పాల్ హోమో ఏమో అని ... నిజానిజాలు తేల్చాల్సిన వాళ్ళు దండిగా డబ్బులు తిని న్యాయాన్ని దాచేశారు... ఇది నాలుగో సంఘటన ఈ నారాయణ కాలేజ్ లలో .. ఇలానే వదిలేస్తే మరెన్నో ... నాదొక్కటే విన్నపం అందరికి ... సమస్య మూలం కార్పోరేట్ వ్యవస్థ ... దాన్ని వేళ్ళతో నాశనం చేయండి ... దీనికి అందరు సహకరించండి .. పిన్నలకు పెద్దలకు ఇదే నా విన్నపం .. మరో హృతిక్ బాలి కాకుండా పాడుకుందాం ... సమస్య చెప్పాను ... పరిష్కారం చెప్పాను ... దీనిలో న్యాయం ఉందో లేదో మీరే చెప్పండి ... !!
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)