11, అక్టోబర్ 2010, సోమవారం

తస్మాత్ జాగ్రత్త....!!!

నాకు తెలిసిన ఒక కుటుంబం గురించి చెప్తాను ఇక్కడ....మనం మాములు గా అనుకుంటూ వుంటాము భార్య, భర్తలలో దేముడు ఒకరిని అటు ఒకరిని ఇటు కూర్చుతాడని, కాని ఇక్కడ ఇద్దరు ఒక్కటే...వాళ్ళకు వాళ్ళ పిల్లాడికి మంచి జరుగుతుందని కాని, డబ్బులు వస్తాయనుకుంటే డబ్బుల కోసం ఎలాంటి పని చేయడానికైనా వెనుకాడరు...అమ్మనాన్నని కుడా విడదీస్తారు. మంచి మానవత్వం అనేవి వీళ్ళకు అస్సలు తెలియదు. అన్నవదినలవి పదిహేను లక్షలు తిని అస్సలు ఇవ్వనక్కర లేదు ఏం చేసుకుంటారో చేసుకోండి అని అన్నారు. వాళ్ళిద్దరికీ కుడా ఎన్నో గొడవలు పెట్టారు. అమెరికా తీసుకు వెళ్లి మూడు నెలలు ఇంట్లో వుంచుకుంటే మూడు నెలల్లో ముప్పైవేల డాలర్లు ఖర్చుపెట్టించారు వాళ్ళతో... తిరిగి ఒక్క పైసా ఇవ్వకుండా చాలా మాటలు మాట్లాడారు. జాతినీతి లేని ఇలాంటి వాళ్ళని చూడటం ఇదే ప్రధమం. వాడి చెల్లెలు,అక్క కుడా అంతే. అందుకే భార్య కుడా అలాంటిదే దొరికింది. అన్న కారు, సామానులు మొత్తం అన్ని తీసుకుని ఇప్పుడు ఒక్క పైసా ఇవ్వము నీకు పెళ్ళికి బోల్డు డబ్బులు ఇచ్చాను, మీ అబ్బాయికి సైకిలు కొని పెట్టాను అని చెప్పారు..... వాడు ఇంట్లో కూర్చుంటాడు పిల్లాడి పనులు, ఇంట్లో పనులు చేస్తాడు .... ఇక భార్య ఉద్యోగం వెలగబెడుతుంది బయట ఏదైనా సరే ....నాఅంతటిది లేదు కోట్లు సంపాదించాను అని గొప్పలు చెప్పుకుంటూ వుంటుంది. వాడి చెల్లెలి పెళ్ళికి వాడికి రూపాయి ఇవ్వడం చేతకాలేదు ఈ రోజు మాత్రం ప్రేమ కారిపోతూ వుంటుంది అక్క చెల్లెళ్ళ మీద...అక్క చెల్లెళ్ళు కుడా సొమ్ము తిన్న వాళ్ళని మాత్రం దూరం పెట్టి ఈ కసాయి వెధవని అందలం ఎక్కించారు. ఇలా అందరి సొమ్ము తింటే కోట్లు ఏం ఖర్మ మిలియన్లు సంపాదించవచ్చు. అందుకేనేమో వాళ్ళ అమ్మనాన్న ఇవి అన్ని చూడాల్సి వస్తుందనేమో ముందే పోయారు ఆ అదృష్టవంతులు...
వెయ్యి గద్దలను తిన్న రాబందు ఒక గాలివానకు పోతుంది అని....వీళ్ళ పాపం పండక పోదు దేముడు అనేవాడు వుంటే చూడకా పొడు...అందుకే తస్మాత్ జాగ్రత్త....!!! మీకు ఇలాంటి వాళ్ళు ఎదురు పడవచ్చు మీ ఇంట్లోనైనా, బయట అయినా.....ముందుగా మేల్కొని దూరంగా వుంచండి ఇలాంటి వెధవల్ని..... !!

10 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అశోక్ పాపాయి చెప్పారు...

chaala manchi vishayam chepparandi...

చెప్పాలంటే...... చెప్పారు...

అందరిలో మంచి చెడు వుంటుంది కాని ఇలాంటి వాళ్ళలో స్వార్ధం, చెడు తప్ప తన మన అని వుండదు. వాళ్ళు మాత్రమే బావుండాలి ఇక అమ్మయినా, నాన్నయినా, అక్క ,అన్న, చెల్లి, స్నేహితుడు ఇలాంటి బంధాలు ఏమి వుండవు వీళ్ళకి.....అర్ధం చేసుకోండి....థాంక్ యు చదివి చెప్పినందుకు ...

jaggampeta చెప్పారు...

మనిషిలో "మనీ" చూసేవారు అలాగే ఉంటారు

చెప్పాలంటే...... చెప్పారు...

మీరు చెప్పింది నిజమేనండి

Lakshmi Raghava చెప్పారు...

naaku kuda taarasapaddaru ilati vaallu...veerini maatalato gelavalemu..matladite kariche rakalu..appudu mounam saranyam ayyindi..meeru rasindi nijam...
lakshmi raghava

చెప్పాలంటే...... చెప్పారు...

నేనేనేమో అనుకున్నాను మీరు కుడా అన్న మాట...చాలా కష్టమండి ఇలాంటి వాళ్ళతో....

మాలా కుమార్ చెప్పారు...

ఇలాంటి వాళ్ళని ముందే ఎలా తెలుస్తుంది ? మంచి మాటల తో , నాటకాల తో బురిడీ కొట్టిస్తారు . అది , తెలిసి జాగ్రత పడే లోపు చేతులు కాలిపోతాయి .
ఏదైనా జాగ్రత్తగా వుండటము మంచిదే లెండి .

చెప్పాలంటే...... చెప్పారు...

అందరు మంచివాళ్ళే అనుకోవడం మన బలహీనత దాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు..ముందు తెలియదు కాని ఎన్ని సార్లు ఇలా జరిగినా మళ్ళి మామూలే కదా మనం....

Time చెప్పారు...

meeru rasindi chadivina taravata..ilanti manushulu ela untaru anipistundi ..kadu enduku brathiki untaru anipistundi...

చెప్పాలంటే...... చెప్పారు...

ఈ రోజుల్లో నూటికి తొంబైతొమ్మిది మంది అంతేనండి...వాళ్లకి డబ్బులు + వాళ్ళ అవసరాలు తీరటమే కావాలి మీకు ఇప్పటి వరకు ఇలాంటి వాళ్ళు ఎదురుపడలేదు అంటేనే నమ్మబుద్ధి కావడం లేదు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner