వీచే చిరుగాలిలో....
కురిసే చిటపట చినుకులలో....
చుట్టుముట్టిన నీ ఆలోచనలతో....
జాబిలమ్మను అడిగా నీ జాడ కొరకై !!
వచ్చే పున్నమికైనా చెప్పమని....!!
మౌనం గానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధమందులో ఉంది.............. అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలినచోటే కొత్తచిగురు కనిపిస్తుంది
మౌనంగా వుంటే ఎన్నో ఆలోచనలు వస్తాయి అందరికి....నాకు నా ఆలోచనలను అందరితో పంచుకోవాలని అనిపించి ఇది మొదలు పెట్టాను....మీ సలహాలు సూచనలు నాకందిస్తారని అనుకుంటూ....
చిన్నప్పటి నుంచి ఏదో చేయాలని వుండేది, అది కవితైనా, కధైనా వ్యాసమైనా, జీవితమైనా ఏదో ఒకటి... కనీసం ఒక్కరికి మనం మంచి చేయగలిగితే చాలు అనిపించేది. అమెరికాలో వున్నప్పుడు రోజు న్యూస్ పేపర్స్ లో అప్పుడే పుట్టిన పిల్లలని వదిలేసిన లేదా చంపేసిన సంఘటనలు ఎన్నో చదివి చాలా బాధ అనిపించేది....అలాంటి మానసిక సంఘర్షణల కి ఎన్నిటికో... ఒక రూపం నేను మొదలు పెట్టిన "URLC ట్రస్ట్"...ముందు ముందు మీ అందరి సహకారాన్ని సహాయాన్ని ఆశిస్తూ....నాలో వున్న నన్ను మీ ముందు ఉంచే ఈ చిరు యత్నమే.......
8 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
inthaki answer dorikinda?
అంత తొందరైతే ఎలా? పున్నమికి కదా వెయిట్ చేయాలి మరి...ఏ పున్నమో తెలియదు గా !! -:)
evari jada andi? maku chebite vetiki pedatam kada?
మీకా శ్రమ అక్కరలేదులెండి -:)
త్వరగ తెలుసుకోండి మరి ఆలస్యం ఎందుకు :)
సరేనండి...థాంక్ యు
ayya baboi.sramem anukonandi.vetiki pedatanu cheppandi medam...
మీ సహాయం అవసరమైనప్పుడు అడుగుతాన్లెండి....-:)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి