23, మార్చి 2013, శనివారం

మనిద్దరి మధ్యలో.....!!

శిధిలమైన గుండెను ఇంకా ఇంకా
చిద్రం చేస్తూనే ఉన్నావు....
నీ మాటల శర పరంపరలతో....!!

ముక్కల చెక్కలైన మనసుని
ఎక్కడ అతుకు వేస్తానో అని....
ముక్కలన్ని చిక్కకుండా
చెల్లాచెదురు చేస్తున్నావు...!!

నేనేమో ఆ ముక్కల్లో
నీ  జ్ఞాపకాల పాల పుంతలు
కరిగి కనిపించకుండా పోతున్నాయని
పట్టుకుని పేర్చుకుందామని
పిచ్చిదానిలా వెదుక్కుంటు....న్నాను....!!

చెదిరి పోయిన గతంలో
చెరగని వాస్తవం నువ్వు
గడిచిపోయిన కాలంలో
గతించి పోయిన జ్ఞాకపకం నేను
అందుకేనేమో మన మధ్య
ఇంత అంతరం.....!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అజ్ఞాత చెప్పారు...

చెదిరి పోయిన గతంలో
చెరగని వాస్తవం నువ్వు....

ఏం కామెంట్ పెట్టాలో తెలియటం లేదు..అన్ని కవితలూ చదివా..సూపర్బ్..

చెప్పాలంటే...... చెప్పారు...

చాలా సంతోషం... అంతగా నా కవితలు మీకు నచ్చినందుకు ధన్యవాదాలు kvsv గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner