దాని చుట్టూ అందమైన
అల్లికలను పేర్చుకుంటే....!!
ఓర్వ లేని దైవం
పాశాన్ని పాశవికంగా లాగేసుకుంటే....!!
పెంచుకున్న మమతానుబందాలు
వెల వెల పోతుంటే....!!
తెగిపోయిన ఆ బంధం
అందనంత దూరంలో విల విలలాడుతూ
ఆ కన్నీటితో.....
ఆకాశంలో చుక్కలా మెరుస్తుంటే....!!
అటు వెళ్ళ లేక ఇటు ఉండలేక
ఆ తల్లి మనసు పడే తపన
ఏ అక్షరాలకు దొరకనిది....!!
విధి ఆడే చదరంగంలో
వింత పావులం మనం....!!
ఏమి చేయలేని నిస్సహాయ జీవులం...!!
( నా చిన్నప్పటి నేస్తం పడుతున్న బాధను తీర్చలేను.... అనుకోకుండా నేను చూడకుండానే అనంత లోకాలకు తరలి వెళిపోయిన తన పాపకు ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటూ....తల్లడిల్లుతున్నఅమ్మ మనసు పాపకు అంకితం )
1 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
చాలా బాగా రాసారండి ,
ధన్యవాదాలు ,
http://www.techwaves4u.blogspot.com/
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి