10, ఆగస్టు 2013, శనివారం

సిగ్గుతో తల వంచుకుంటూ...!!

మన ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ గారు చెప్పిన మాటలు ఆలోచించాల్సినవే....కావూరి గారు అన్నది నిజమే మరి... శ్రీకృష్ణ కమిటి పనిచేసింది ప్రాంతీయత కోసం..కాని ఆంటోని కమిటితో ఉపయోగం పార్టీకే...ప్రాంతాలకు,   ప్రాంతీయతకు కాదు. తెలుగు జాతి తలవంచుకునే పరిస్థితి ఇప్పుడు మనకు వచ్చింది. ఇది మన స్వయంకృతాపరాధమే...బలమైన ప్రాంతీయతను బలహీనం చేసి తన లాభం చూసుకుంటున్న ఈ కుహనా రాజకీయాలు, కుతంత్రాలు చూస్తూ కూడా ఇంకా ఈ కమిటిలకు విలువ ఇవ్వాల్సిన లేదు. ఒకే భాష మాట్లాడే ప్రాంతాన్ని విభజన పేరుతొ వేరు చేసి తెలుగు జాతిని నిర్వీర్యం చేసి తన పెత్తనాన్ని కాపాడుకోవాలని ఏమి కాని ప్రాంతీయతకు సంబంధం లేని ఓ నాయకురాలు ఎవడో దీక్ష చేసాడని ముక్కలు చెక్కలు చేస్తుంటే చూస్తూ ఊరుకోవడం తప్ప ఏమి చేయలేని మనం గెలిపించిన నాయకులది తప్పా...!! లేక అలాంటి నాయకులకు పట్టం కట్టిన మనది తప్పా....!! ఎంతో బలముండీ వారి  బలహీనతలను గెలవలేని మన నాయకులది ఏ జాతి అనుకోవాలి...?? ఒక్కడు దీక్ష చేస్తే తెలంగాణా ఇచ్చినప్పుడు ఇప్పటికి పదకొండు రోజుల నుంచి ఒకరు ఇద్దరు కాదు అన్ని ప్రాంతాల వారు కలసి కట్టుగా చేస్తున్న నిరసనలు అమ్మగారికి కనపడటం లేదా...!! వినపడటం లేదా...!! అన్య దేశం నుంచి వచ్చి విభజించి పాలించే నీతిని బాగా ఒంట పట్టించుకున్న ఈ నాయకురాలు ఎవరు చేస్తే నాయకురాలు అయ్యిందో మర్చి పోయి తన స్థానం, తన కొడుకు సింహాసనం కోసం ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి కరడు గట్టిన ఉగ్రవాదులే నోరు తెరిచేటట్టు చేసిన తన తెలివికి నిజంగా అభినందనలు చెప్పాలి తెలుగు జాతి మొత్తం....సిగ్గుతో తల వంచుకుంటూ...!!

8 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Unknown చెప్పారు...

తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా రూపొందడానికి కారణం majority సీమాన్ధ్రముఖ్యమంత్రులు చేసుకున్న ఒప్పందాలనన్నీ తుంగలో తొక్కి ఉల్లంఘించడమే!తెలంగాణా ప్రజలకు అన్యాయం చేయడమే!డిసెంబర్ 9 న చేసిన ప్రకటన్నుంచి ఒత్తిడి పెంచి U turn తీసుకునేటట్లు చేశారు ఆంధ్రసీమ నాయకులు!కాంగ్రెస్ ఈసారి పెద్దకసరత్తు చేసి పకడ్బందీగా ఒక రాజకీయ వ్యూహంతో ఎత్తులకు పై ఎత్తులు వేసే చతురతను ప్రదర్శించింది!మళ్ళీ తెలంగానారాష్ట్రాన్ని ఆపడం ఎవ్వరికీ సాధ్యంకాని రీతిలో జాగ్రత్తగా అడుగులు వేస్తోంది!ఆంధ్ర ప్రదేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అనడంలో సందేహం లేదు!ఆయన అధిష్టానంతో సంపూర్ణంగా సహకరించడం ఆయన భవిష్యత్తుకే మంచిది!

అజ్ఞాత చెప్పారు...

gelugu jaati kaadamaa telugu jaati...

Jai Gottimukkala చెప్పారు...

"ఒక్కడు దీక్ష చేస్తే తెలంగాణా ఇచ్చినప్పుడు ఇప్పటికి పదకొండు రోజుల నుంచి ఒకరు ఇద్దరు కాదు అన్ని ప్రాంతాల వారు కలసి కట్టుగా చేస్తున్న నిరసనలు అమ్మగారికి కనపడటం లేదా"

అన్ని ప్రాంతాల వారు గొడవ చేస్తున్నారా, వింటే ఎవరైనా నవ్వగలరు. తెలంగాణాలో ఎవరూ అడగనప్పుడు అది సమైక్యం ఎలా అవుతుంది?

తెలంగాణాలో ఇంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా, ఉదృతంగా జరిగిన ఉద్యమాలు కళ్ళు లేని కబోది కయినా కనిపిస్తాయి. మీకెందుకు అగుపించాలేదో?

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు అజ్ఞాత గారు పొరపాటుకు మన్నించండి

చెప్పాలంటే...... చెప్పారు...

అగుపించాయో లేదో..!! నాయకుల స్వార్ధం కోసమో అన్ని నిజాలు అందరికి తెలుసు అండి....తెలంగాణం కోసమో హైదరాబాద్ కోసమో అందరికి తెలుసు అండి

అజ్ఞాత చెప్పారు...

"సీమాన్ధ్రముఖ్యమంత్రులు చేసుకున్న ఒప్పందాలనన్నీ తుంగలో తొక్కి ఉల్లంఘించడమే"

మీరు ఇన్ని రోజులనుంచి చెప్పింది మాకర్థంకాలేదని ఎలా అనుకొంటారు? సీమాంధ్ర్రులను ఎడ్యుకేట్ చేసినంత వరకు చాలు. ఎప్పుడో , ఎవడో చేసినందుకు మీరు రోజు బ్లాగులో చేరి తిడుతూంటె మేమేమి, మీసొమ్ము తినలేదు, తిట్లు తినిపించుకోవటానికి , చేతనైతే కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి, మీకు రావలసిన వాటా మీరు పొందండి.

"ఆయన అధిష్టానంతో సంపూర్ణంగా సహకరించడం ఆయన భవిష్యత్తుకే మంచిది."

ఖాళీగా కూచొని బ్లాగులో కామేంట్లు రాసుకొనే, మీకు తెలిసినంత ఒక ముఖ్యమంత్రికి తెలియదా!? భలే.

ఆయన మంచి చెడు ఆయనకు తెలుసులే. రెండెళ్లుగా ముఖ్యమంత్రి పదవి చేశాడు. ఎక్కువతక్కువ ఐతే ఇంటికి పోయి కూచొంటాడు. కాని ఆయన ఎదురుతిరిగితే, పదవి నుంచి తొలగించే ప్రాసేస్ కాంగ్రెస్ అధిష్టాన వర్గం చేయ గలుగుతుందా? వేడేక్కిన ప్రస్తుత పరిస్థితిలో,
వాళ్లకి అంత ధైర్యం ఉందా? అంటే లేదనే చెప్పాలి. ఆయనను బ్లాక్మై చేసి తొలగించటానికి ఆయన చేసిన స్కాంలు లేవు. రామూ సోము బ్లాగులో తమాషాగా సెటైర్ రాసినట్లు ఆయనేమి బ్రహ్మానందం కాదు. ఆయన ప్రెస్ మీట్ చూసి అధిష్టానికి ఈ పాటికే కాళ్లకింద భూమి కంపించి, కళ్లు తిరిగి చెమటలు పట్టి ఉంటాయి. అధిష్టానం మేకపోతు గాంభీర్యం ప్రదర్సించాల్సిందంతె. విజయశాంతిని తెరస నుంచి తొలగించినంత తేలిక కాదు, ఒక ముఖ్యమంత్రి మాటను కాదని, ఒక నిర్ణయం ముందుకు తీసుకుపోవటం. చూస్తూండు ఆయన సంగతి ముందు ముందు మీకే తెలుస్తుంది.

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు అజ్ఞాత గారు మీ సలహాకి....నేను ఖాళీగా కూర్చుని బ్లాగ్లో కామెంట్స్ రాస్తున్నా అని తమరు చెప్పారు.....సరే ఎవరు ఎం చేస్తారో ఏ నాయకుల గోల ఏంటో నాలుగు రోజులు పొతే అందరికి తెలుస్తుంది....పాపం మీ సమయాన్ని చాలా వెచ్చించారు నా కోసం

Jai Gottimukkala చెప్పారు...

"తెలంగాణం కోసమో హైదరాబాద్ కోసమో అందరికి తెలుసు అండి"

అయ్యా మీరు తెలంగాణా ప్రజలను ఎప్పుడయినా అడిగారా?

ఇప్పుడు ఆంధ్రలో జరిగే లొల్లి హైదరాబాద్ కోసమే.

ఎప్పటికీ మాదే అయిన హైదరాబాద్ కోసం మేము గొడవ చేయాల్సిన అవసరం లేదు.

How can 13 districts ask the other 10 stay united by force?

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner