20, ఆగస్టు 2013, మంగళవారం

దాసోహమంటూ...!!

మనసు సతమతమై పోతోంది ఎందుకో
నీ భావనల అలజడి తాకిడికి తట్టుకోలేక...!!

గుండె గొంతుక కొట్టుకుంటోంది ఆగకుండా
నీ ఊసుల వెల్లువలో తడిచిపోతూ...!!

మది కలవర పడి పోతోంది తెలియకుండానే
నీ జ్ఞాపకాల ప్రవాహంలో మునిగిపోతూ...!!

ఎద ఎగిరి పడుతోంది అనుక్షణం
నీ గురుతుల గాయాలతో ఊపిరందక... !!

ఏదో తెలియని మాయ కమ్మింది నా చుట్టూ
నీ అనుభూతుల పరిమళం అనుకుంటా అది...!!

నీతోనే ముడిపడిన నా ప్రపంచం 
ప్రతిక్షణం కనుల ఎదుట నిన్నే తలపిస్తోంది..!!

ఎందుకో ఈ అంతంలేని అనురాగం
ఎల్లల్లు లేని నీ అభిమానానికి దాసోహమంటూ...!!

3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Hima bindu చెప్పారు...

nice andee

జయ చెప్పారు...

చాలా బాగా చెప్పారండి. కవితా విధానం బాగుంది.

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు చిన్ని గారు, జయ గారు చాలా రోజులకి మీ దర్శనం :)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner