2, ఆగస్టు 2013, శుక్రవారం

రాజ నీతి...!!

నిప్పు రాజేసి నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే సరిపోతుందా..!! పుట్టినరోజు కానుకగా కె సి ఆర్ గారి దీక్షకు సంతోషించి అమ్మగారు బహుమతిగా ఆంద్ర రాష్టాన్ని ముక్కలు చేసాను తీసుకోండి అన్నారు... మళ్ళి తూచ్ అని వెనక్కు తీసుకుని ఇన్ని రోజులు చోద్యం చూసి ఆత్మ బలిదానాలు, బందులు, రాస్తా రోకోలు అన్ని సినిమా చూసినట్టు చూసి చిటుక్కున తెలంగాణా ఇచ్చేసాము మీ ఇష్టం అంటే సరిపోతుందా..!! విభజన తప్పదు అని తెలిసినప్పుడు ఇరు పక్షాల వాళ్లకి సమంగా ఉండాలి...రాజధాని ఏదో..!! నిధులు ఎన్నో ఏంటో చెప్పకుండానే తీర్మానం చేస్తే సరి పొతుందా..!!
దిగ్విజయ్ సింగ్ గారు మీకు తెలుగు రాష్ట్రం గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు..?? సీమాంధ్ర నేతలకు హామీ ఇస్తున్నాము అంటే నేతలకు కోరికలు తీరుస్తారా...!! ప్రజలు గుర్తు లేరా మీకు...!! తెలంగాణా ఇచ్చేసాము సీమాంధ్ర నేతలకు, ప్రజలకు భయం లేదు అంటే సరిపోతుందా..!! ఇక తెలంగాణా చావులు చూసాము కదా మిగిలిన తెలుగు వాళ్ళ చావులు చూడాలని కోరికగా ఉన్నట్టు ఉంది...!! మాలో మాకు పెట్టి మీ పబ్బం గడుపుకుంటున్నారు. విభజించి పాలించే నీతిని ఒంటబట్టించుకుని పదవుల కోసం, డబ్బు కోసం పార్టీలు మారే నేతలు అమ్మకు సలాములు చేయండి.... గంగిరెద్దుల్లా తలలూపండి....అంతే కాని తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టకండి...మిమ్మల్ని నమ్మి గెలిపించిన పాపానికి...!!
గెలిచేదొక పార్టి గుర్తుతో...పదవి కోసం మారేది మరొక పార్టీలోకి... కనీసం మీ స్వార్ధం చూసుకునేటప్పుడు ఒక్కసారైనా మిమ్మల్ని గెలిపించిన జనాలు గుర్తుకు రాక పోవడం మా దురదృష్టం. ఇలాంటి నేతలను నమ్మి ఎన్నుకుని మేమే తప్పు చేసాము. రాజీనామాలంటారు...మళ్ళి  ఎన్నికలంటారు...ఈ డబ్బులన్నీ మా నెత్తిన రుద్దుతారు నిత్యావసర ధరలను పెంచి...ఎక్కడా లేని ఎవరో కాల్చుకున్న ఏళ్ళ  తరబడి బిల్లులు కట్టమంటారు...దొరికినంతా దోచుకుని ఖజానా ఖాళీ అని చేతుతెత్తేస్తారు...పదవుల కోసం ఉచ్ఛ నీచాలు మరచిపోతారు...!! మరి ఇలాంటి నాయకులను గెలిపించిన మనది తప్పే కదా...అందుకే అనుభవిస్తున్నాము.
కనీసం ఇప్పుడైనా మీకు మనస్సాక్షి ఉంటే నాటకాలు మాని పార్టీలకతీతంగా జనం కోసం, తెలుగు జాతి కోసం సమైక్యంగా పోరాడి గెలుపు పిలుపు వినిపించి మీరూ మనసున్న మనుషులే అని నిరూపించండి.

3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Vara Prasad Vutukuri చెప్పారు...

ఇది న్యాయమా?

ఎన్నో ఏళ్ళుగ పెంచుకున్న మమకారం
ఎంతోకాలంగ పెనవేసుకున్న అనుబందం
ఒక్కమాటతో ముక్కలవ్వాల్సిందేనా ?
ఎవరి స్వార్ధానికో బలియవ్వాల్సిందేనా?
చిన్నప్పటినుండి విశాలాంధ్ర గా చదువుకుని
ఆంధ్రప్రదేశ్ అనగానే గుర్తొచ్చే నిండుగా ఉండే మ్యాప్
ఇప్పుడు ఉహించడానికే వెగటుగా ఉంది
ఒకే భాష మాట్లాడే ప్రజలు
రెండు ముక్కలయి పోవాల్సిందేనా?
స్వార్ధమా నీవెంతటి వంచకివే!
ఈ నేల, ఈ గాలి, ఇక్కడ పెనవేసుకున్న
బoధాలు, అనుబంధాలు, సంబంధాలు
ఎవరి నిర్ణయానికో ఎడబాయవల్సిoదేనా?
భాషా ప్రయుక్త రాష్ట్రంగ
ఏర్పడ్డ "తెలుగు జాతి " దూరమవ్వాల్సిoదేనా?
పొట్టిశ్రీరాములు ప్రాణత్యాగానికి
మనమిచ్చే విలువిదేనా?
ఎవరి స్వార్ధంకొరకు ఈ దూరo
గతమెంతో ఘనత గలిగిన జనం
ఇప్పడు రెండుగా విడిపోవాలా మనం?
ప్రగతి నిర్దేశకులారా! ప్రపంచ పౌరులారా!
బాంధవ్యాల బలం తెలుసా మీకు.
మమకారపు మాధుర్యం తెలుసా మీకు?
తెలిస్తే ఈ చర్యను ప్రతిఘటిoచండి
-ఊటుకూరి జయ దీపిక

Unknown చెప్పారు...

డిగ్గి రాజా మీద విరుచుకుపడడం అంత భావ్యంగాలేదు!అతనొక నిమిత్తమాత్రుడు,అధిష్టానం ఆదేశించిన పలుకులు పలికే చిలక!ఆంధ్రసీమ,తెలంగాణా విభజన ఒక చారిత్రిక వాస్తవం,reality!సీమాంధ్ర లోని ప్రతి పార్లమెంట్ సభ్యుడికి కేంద్రమంత్రికి ఎన్నడో స్పష్టంగా తెలుసు!కేంద్రం జీవనాడి వారికి పూర్తిగా తెలుసు!తెలంగాణా ను ఇక ఆపడం ససేమిరా సాధ్యం కాదని తెలుసు!అప్పుడు గమ్మున మిన్నకుండి ఇప్పుడు సామాన్యప్రజలను విద్యార్థులను రెచ్చగొట్టడం ఎంతవరకు సబబు!?

ramana.sree@ymail.com చెప్పారు...

అయ్యా సూర్యప్రకాష్ గారూ అంతా ఆ హైదరాబాద్ చుట్టూనే తిరుగుతోంది. హైదరాబాద్ ను వదులుకోడం మర్చిపోడం ఏ తెలుగు వాడికి నచ్చదు. దాని గురించి అంతం దాకా పోరాడతాడు. స్వాతంత్ర్యం వచ్చాక అందరు తెలుగులకూ ఆ హైదరాబాదే స్వప్నం. దానికే లక్షలాది మంది అక్కడకు చేరారు. వాళ్లంతా మరో బొంబాయి లోని ఉత్తరాది వాళ్లల్లా కాందిశీకులవ్వలేరు. ఇది యిందులోని సూక్ష్మం అది మీకూ తెలియనిది కాదు. 1956 బౌగోళిక గీత జాగో బాగో పెట్టె బేడా మూటా ముల్లి లాంటi మాటలు సహించలేరు.దాని మీద పూర్తి అధికారం కూడా వచ్చేదాకా ఉద్యమం ఆగదు. సిసలైన తెలంగాణుడు యీ సీమాంధ్రుది భావనను తిరస్కరించదం లేదు. తానూ ఒక కాందిశీక కుటుంబీకుడే ీతని మాతలే యిక్కడి వాళ్లను వేడెక్కింది ఉద్యమించేలా చేస్తున్నాయి.ి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner