17, ఆగస్టు 2013, శనివారం

పనికిరాని విషయానికి పెద్ద పీట....!!

ఎవరో వి హెచ్ గారి మీద తిరుపతిలో చెప్పులు విసిరారట....అదో పేద్ద  విషయంలా ఓ....గొంతు చించుకుంటున్నారు అందరు...సీమాంధ్ర పనికిరాలేదు కాని తెలంగాణా నాయకులకు సీమాంధ్రలో ఉన్న దేవుడు పనికివచ్చాడు కాబోలు....వీలు కాక వెంకన్నను వదిలేసారు కాని లేకపోతే తిరుమల తిరుపతి కూడా మా తెలంగాణం లోనిదే అనేవారు....ఎవరో కడుపు మండి విసిరిన చెప్పుకు ఆ పార్టీ వాళ్ళు వెనుక ఉండి చేయించారు వీడియోలు చూడండి అది ఇది అని గొంతు చించుకుంటే ఎవడికి పడుతుంది ఈ గోల....ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియక అందరు ఆందోళనలో ఉంటే నా మీద చెప్పు వేసిన వాడిది ఏ పార్టినో కనుక్కోండి అంటుంటే నవ్వు రాక చస్తుందా చెప్పండి...!!
మరి ఆనాడు తెలంగాణా కోసం కె సి ఆర్ గారికి ఎవరు అనుమతి ఇచ్చారు...?? అదే దీక్షలు ఇప్పుడు చేయాలంటుంటే ఎందుకు నిరాకరిస్తూ సంబంధం లేని కారణాలు చెప్తున్నారు...?? ఎక్కడో మారుమూల అవనిగడ్డలో అసలు ఏకగ్రీవంగా ఎన్నిక జరగాల్సి ఉండగా ఆరు నెలల అధికారం కోసం చనిపోయిన బ్రాహ్మణయ్య గారి సీటు కోసం ఎన్నడు లేని విధంగా దిగజారిన కాంగ్రెస్ పార్టి ఉప ఎన్నికలకు పోటి పడగా ఉప ఎన్నిక ఈ నెల ఇరవై ఒకటిన జరుగుతుంటే విజయవాడలో శాంతి భద్రతలు కాపాడటానికి మన పోలీసుబాబులు ముందు జాగ్రత్త చర్యల ముందు చూపు ఎంత బావుందో చూశారా....!! ఎప్పుడు అంతా అయిపోయిన తరువాత తీరికగా వచ్చే రక్షక దళంకి ఇంత ముందు చూపా...!! నమ్మలేని నిజం...!! సీమాంధ్ర ఉద్యమం నాయకుల చేతి నుంచి ఎప్పుడో జారి పోయింది. ప్రజలు చెప్పినట్టు నాయకులు పార్టీలకు అతీతంగా నడవాల్సిన పరిస్థితి వచ్చింది. వెనుక పడి పోయాము మాకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వండి అంటే సరిపోతుందా....!! చాలా జిల్లాలు వెనుకపడే ఉన్నాయి మరి అవి అన్ని అభివృద్ధికి నోచుకోవద్డా...!! దీక్షలు చేస్తున్నారని రోజుకో రాష్ట్రం లెక్కన ఇస్తారా మేడం గారు...!! భరతావనిని ఎన్ని ముక్కలు చెక్కలు చేయాలని కంకణం కట్టుకున్నారో....!!
ఉద్యమాలు చేయడం, దీక్షలు చేయడం మాకు వచ్చు.....మీ దగ్గరే నేర్చుకున్నాము.....మీరు చూపిన దారిలోనే నడుస్తున్నాము కాకపొతే మీరు దోచుకోవడానికి చేస్తే మేము అదే పనిని అందరి అభివృద్ధి కోసం....నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని....మీ దారే మా రహదారిగా చేసుకున్నాము....!!ఎందుకీ విభజన అస్త్రం అన్నది అమ్మగారికే ఎరుక...!! మీరు మీరు తన్నుకు చావండి చచ్చాక మిగిలిన బలాబలాల్లో చూసుకుంటాను ఆంధ్రానా...!! తెలంగాణానా...!! అని సినిమా చూస్తున్నారు హై కమాండ్....!! చూద్దాం ఏం జరుగుతుందో.... !!

19 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అజ్ఞాత చెప్పారు...

annee nagna satyale. NICE..

చెప్పాలంటే...... చెప్పారు...

Thank u andi

అజ్ఞాత చెప్పారు...

"సీమాంధ్ర పనికిరాలేదు కాని తెలంగాణా నాయకులకు సీమాంధ్ర దేవుడు పనికివచ్చాడు కాబోలు..."
vekateswara swamy సీమాంధ్ర దేవుడు ela avuthado.. konchem vivarinchandi.

Jai Gottimukkala చెప్పారు...

""సీమాంధ్ర దేవుడు

Tirupati is in Andhra but Lord Balaji is not any Andhra guy's paleru. Every Hindu can visit any temple.

In earlier days, Dalits were not allowed in some temples. Andhra fanatics are now trying to stop Telangana people from entering temples.

చదువరి చెప్పారు...

Jai Gottimukkala: గబగబా అపార్థం చేసేసుకుని టకటకా పెడర్థాలు తీసేదానికి పూనుకోకండి. ఎక్కడివారైనా ఆ గుడికి వెళ్ళవచ్చు. వెళ్లకూడదని ఈ టపాలో అననూ లేదు. ప్రత్యేకించి ఆ ముక్క చెప్పక్కర్లేదు.

అసలీ సంఘటనలో గానీ, ఈ టపాలోగానీ గుడికి రానీయమని/వెళ్ళనీయమని ఎక్కడ రాసారు? ఎందుకీ అడ్దగోలు రాతలు?

ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి.. బెజవాడ కనకదుర్గకి, పోతనకి, నన్నయకి, కాకతీయులకీ, రాయలకీ ప్రాంతీయతను ఆపాదించిన ప్రబుద్ధులెవరో గుర్తుకుతెచ్చుకోండి. కేవలం ప్రాంతీయత కారణంగానే ఈ ప్రాంతీయత లేమీ తెలియని పెద్దల విగ్రహాలను కూల్చిన ముష్కరుల సంగతిని ఏ చాప కిందకి తోసేసారు?

ఆంధ్రా ఫ్యానటిక్సా..? పోనీ ఫ్యానటిక్సే అనుకుందాం.. కానీ వాళ్ళు అతణ్ణి గుడికి వెళ్లనివ్వకుండా ఆపలేదే! వెళ్ళేటపుడు సుబ్బరంగానే వెళ్ళాడతడు, తిరిగి వచ్చేటపుడే అతణ్ణి ఎదుర్కొన్నారు. ఎందుకూ? గుళ్ళో అతడు వాగిన వాగుడు కారణంగా! గుడికి వెళ్ళిన వాడు వాగాల్సిన వాగుడేనా అది? అలా రెచ్చగొట్టడం తగినా? మరి అతణ్ణేమనాలి?

తెవాదులు చేసిన భౌతిక హింస సంగతేమోగానీ, మీలాంటివాళ్ళు మాటలతో చేస్తున్న ఇలాంటి హింస ఎన్నో రెట్లు చెడు చేస్తోంది. రాష్ట్రంలోని సామాజిక వాతావరణాన్ని కలుషితం చేస్తోంది. కోస్తా సీమల ప్రజలపై మీ ఈ దాడులను ఆపండి.

Jai Gottimukkala చెప్పారు...

@చదువరి: హనుమంరతావు గారు బెజవాడ దుర్గామ్మకు కానీ ఆ విగ్రహాలకు ప్రాంతాన్ని ఆపాదిన్చారా లేదు కదా. బ్లాగరు మాత్రం స్పష్టంగానే "సీమాంధ్ర దేవుడు" అని వెంకన్నకు ప్రాంతం అతికించారు.

తాను వ్యాఖ్యలు చేయలేదని, విలేఖర్లు అడిగిన ప్రశ్నలకు జవాబు ఇచ్చానని ఆయన చెప్పారు. మీకు నచ్చలేదే అనుకోండి కొట్టడం సబబా? జయప్రకాశ్ నారాయణ్ పిచ్చిగా వాగినందుకే నేను కొట్టానానని అప్పటి ముద్దాయి చెబితే మీరు ఒప్పుకుంటారా?

పవిత్ర మాసంలో సాక్షాత్తు వక్ఫ్ మంత్రిపై రోజాలో ఉన్నప్పుడు "అందరి అభివృద్ధి కోసం" చెప్పు విసిరితే ఒక్కదయినా నోరు విప్పాడా? బ్లాగు ఉంది కదా అని మా ఇలవేల్పును తన ప్రాంతం సొత్తు అన్న మాటలకు అభ్యంతరం చెబితే మీకు దాడిలా అనిపించింది :)

తిరుమల బస్సులు ఆపెసినప్పుడే ఈ అల్లరిమూకల వైఖరి బయట పడింది. విశ్వా హిందూ పరిషద్ వారితో తిరుమల పవిత్రాన్ని భంగం చేయొద్దని మొట్టికాయలు వేయించుకున్న వీళ్ళు ఉద్యమకారులా అవ్వ.

తమిళులు, కన్నడిగులు, తెలంగాణా/గుజరాత్/ఉత్తర భారత్ వారు రాకపోతే ఆయన అప్పులు ఎప్పుడు తీరెను?

తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతం కానీ తమిళనాడులో భాగం కానీ చేస్తే తప్ప తిరుమల వెంకన్నకు ఈ తిప్పలు తప్పేలా లేవు.

Mauli చెప్పారు...

@ ఎక్కడివారైనా ఆ గుడికి వెళ్ళవచ్చు. వెళ్లకూడదని ఈ టపాలో అననూ లేదు. ప్రత్యేకించి ఆ ముక్క చెప్పక్కర్లేదు.

చదువరి గారు , ఈ పోస్టు లో బ్లాగర్ కి లేని భావాలు మీరు ఆపాదిస్తున్నారు :)

అజ్ఞాత చెప్పారు...

హనుమంతరావు కారు మీద చెప్పులు పడింది విలేకరుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినందుకు కాదు.. ఆ విషయం అక్కడికి వచ్చిన జనాలకు తెలిసే అవకాశం కూడా తక్కువే.. ఎందుకంటే గట్టిగ అరగంటలో వార్త అంతగా పాకిందంటే నమ్మలేం..

అక్కడికి పూలు ఇవ్వడానికి వచ్చినవాళ్ళు జై సమైక్యాంధ్ర అని నినాదాలు చేస్తే "అరే బేవకూఫ్, ఎల్లి చచ్చిపోయిన రాజశేకరరెడ్డిని, చంద్రబాబును అడగండిరా కొడకల్లారా" అని అన్నాడు.. ఎంత పూలు ఇవ్వడానికి వచ్చినా మరీ అలాంటి మాటలు మాట్లాడితే చెప్పులు వెయ్యక ఇంకేం వేస్తారు??

ఈ విషయం వైకాపా లీడర్ ఒకరు టీవీ9 చర్చలో అడిగితే నేను హనుమంతుడి లాంటోడిని మాట తప్పను అంటూ ఏదో చెప్పాడు తప్ప నేరుగా ఖండించలేదు.

For once a self proclaimed telangana savior got their own medicine.

karthik చెప్పారు...

గతంలో (2005-06 అనుకుంటా)కే.సీ.ఆర్. ఒకసారి తిరుపతికి వచ్చి వెళ్ళేటప్పుడు జై తెలంగాణ అంటూ నినాదాలు చేశాడు.. కానీ అప్పుడు అతన్ని ఎవరూ పట్టించుకోలేదు.. కారణం ఇప్పటిలా అప్పుడు రాష్ట్రం రెండు పరస్పర వ్యతిరేక ముఠాలుగా విడిపోలేదు. ప్రస్తుత పరిస్థితిలో తిరుమల వచ్చి అలా మాట్లాడటం కరెక్ట్ కాదు.

ఇక పోతే ఈ చెప్పులేయడం అనేది ఈ హైదరాబాద్ ఉద్యమానికి ఏమాత్రం సంబంధం లేదు.. హనుమంతరావు రాజశేఖర్ రెడ్డిని తిట్టాడు.. అక్కడ వైకాపా వళ్ళు ఉండటం వల్ల చెప్పులేశారు.. అంతే! Spontaneous reaction..

అజ్ఞాత చెప్పారు...

*పవిత్ర మాసంలో సాక్షాత్తు వక్ఫ్ మంత్రిపై రోజాలో
ఉన్నప్పుడు*

@జై,

మీరు ఫక్తు రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారు. రాజకీయనాయకులు ముస్లిం ల దగ్గర మూక బలం ఉందని, వారిని వెనకేసుకొస్తూ మాట్లాడుతూంటారు. మీరు అదేకోవాకు చెందుతారు. అక్బరుద్దిన్ ఒవైసి రాముడి గురించి నోటికొచ్చి మాట్ళాడినపుడు మీరేమాత్రం విప్పారు నోరు? చాల్లే ఊరుకోవయ్యా, మీ అడ్డుగోలు వాదనతో బ్లాగుల్లో మరీ విసిగిస్తున్నావు! మాలిక వ్యాఖ్యల సెక్షన్ అంతా మీ వ్యాఖ్యలే.

"తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతం కానీ తమిళనాడులో భాగం కానీ చేస్తే తప్ప తిరుమల వెంకన్నకు ఈ తిప్పలు తప్పేలా లేవు"

ఎదీ తమిళనాడు లో భాగం చేయించు చూద్దాం. సొల్లు వాగుడు కట్టిపెట్టు.

తెలంగాణ మీరు చేసిపోరాటల వలన కాదు కాంగ్రెస్ ఇస్తామంది. అదే ఐతే ఎప్పుడో అంత మంది ఆత్మాహుతి చేసుకొన్నపుడే ఇచ్చి ఉండాల. వాళ్లకు ఎన్నికలలో ఖర్చు,శ్రమ లేకుండా ఓట్లు వస్తాయనుకొని ఇస్తున్నారు.

చదువరి చెప్పారు...

Jai Gottimukkala:
"కొట్టడం సబబా?" -కానే కాదు.

".. అభ్యంతరం చెబితే మీకు దాడిలా అనిపించింది" - :) దాడి అది కాదు. "Andhra fanatics are now trying to.." ఇదీ దాడి. ఇలా మాట్టాడ్డమే హింస.

"తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతం కానీ తమిళనాడులో భాగం కానీ చేస్తే తప్ప.." - :) ఇది మాత్రం దాడి కాదు. పిల్లి శాపాలు, తీరని కోరికలు, ఉత్త నిట్టూర్పులు - ఈ బాపతు! :)
ఇహపోతే..

తిరపతికొచ్చే తెవాదులకు ఓ హామీ పడెయ్యాలనుంది (అచ్చు తెవాదులు చెప్పినట్టుగా) - తిరపతికొచ్చే తెవాదులను మేం రష్చిత్తాం, మా ప్రాణాలొడ్డైనా వాళ్ళను కాపాడుకుంటాం. వాళ్ళు మా సోదరులు. వాళ్ళు నిర్భయంగా రావొచ్చు పోనూ వచ్చు. ఆ మాటకొస్తే మా పదమూడు జిల్లాల్లో ఎక్కడికైనా రావొచ్చు, పోవచ్చు. మా ఊళ్లలో బతుకమ్మ లాడుకోవచ్చు, తీన్ మార్ డ్యాన్సులూ ఎయ్యొచ్చు. పేడ బిరియానీ వండి పెడతాం. బుల్లెబ్బాయిల్లాగా చూసుకుంటాం. మా ఉద్యమాన్ని అవమానించకండని మాత్రం చేతుల్జోడించి చెబుతున్నాం. మా ఉద్యమాన్ని గౌరవించే గొంగళిపురుగునైనా మేం ముద్దెట్టుకుంటాం. :)

Mauli: :)

చదువరి చెప్పారు...

తిరపతి, హై. లతో పాటు తెలంగాణను కూడా కేంద్రపాలిత ప్రాంతాలుగా చెయ్యమని కోరితే ఈ తిప్పలు ఖచ్చితంగా తప్పుతాయనిపిస్తోంది.

కానీ ఒక చిక్కుంది - తిరపతినీ, హై.నీ తీసుకోడానికి కేంద్రం ఒప్పుకోవచ్చు గానీ తెలంగాణను తీసుకోడానికి ఒప్పుకోదు. (ఎందుకో చెప్పుకోండి చూద్దాం, Jai Gottimukkala. :)) పోనీ మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్ గఢ్ లు తలా కాస్త పంచుకోమని బతిమిలాడదాం - మరో గతి లేదు.

Jai Gottimukkala చెప్పారు...

"ఎంత పూలు ఇవ్వడానికి వచ్చినా మరీ అలాంటి మాటలు మాట్లాడితే చెప్పులు వెయ్యక ఇంకేం వేస్తారు??"

పాపం చదువరి గారికి తెలియక "గుళ్ళో అతడు వాగిన వాగుడు" అన్నారా?

"హైదరాబాద్ ఉద్యమానికి"

Ab baat sahi nikla!

"రాజకీయనాయకులు ముస్లిం ల దగ్గర మూక బలం ఉందని"

Owaisi is YSR chamcha, don't you forget.

"తెలంగాణను తీసుకోడానికి ఒప్పుకోదు"

ఎవరికీ అక్కర లేదనుకునే తెలంగాణా మీకేందుకో? దీని భావమేమి తిరుమలేశ?

The gloves are coming off, aren't they?

karthik చెప్పారు...

>>"హైదరాబాద్ ఉద్యమానికి"

Ab baat sahi nikla!

thanks... For that matter, I believe both the agitations are "Hyderabad Agitations". Nothing more than that..

చెప్పాలంటే...... చెప్పారు...

చదువరి గారు,మౌళి గారు,అజ్ఞాత గారు, కార్తిక్ గారు మీ సమాధానం చాలా వివరంగా ఉంది..జై గారికి అర్ధమైందో లేదో మరి....వీళ్ళ మాటల మూలంగా సర్వాంతర్యాములైన దేవుళ్ళకు కూడా ప్రాంతీయతను ఆపాదిన్చాల్సిన పరిస్థితి వచ్చేస్తోంది....ఇప్పటి వరకు హైదరాబాద్ అంటున్నారు మరి రేపేం అంటారో.....ఏదో ఒకటి లెండి సమస్యను వివరించిన మీకు నా నమస్కారాలు ధన్యవాదాలు

Mauli చెప్పారు...

మంజు గారు,

నేను సమాధానం చెప్పానా ? లేదండీ .. అసలు సీమాంధ్ర దేవుడు ఏంటండీ .. టపా మొదలే అజ్ఞానం గా ఉంది, దేవుళ్ళకి ప్రాంతీయత ఉండడం లో ఇబ్బందేమున్దండీ . కాకపొతే మీరు చెప్పిన దేవుడు అసలు ఆంద్ర కు మాత్రమె దేవుడు కాదు . అలాంటిది మరీ సీమంధ్ర స్థాయికి దిగజార్చేసారు :)


ఇక చదువరిగారు , పెద్దమ్మ..యెల్లమ్మ...బతుకమ్మ తెలంగాణా దేవతలు అలాగే ...కనకదుర్గను ఆంధ్రా దేవత అంటే తప్పేముందో నాకు అర్ధం కాలేదు . గ్రామదేవతలే ఉన్న రోజుల్లో ప్రాంతానికి దేవతలు ఉండడం అసలు అభ్యంతరమే కాదు. కాకపొతే ఇందులో ఇపుడు కొత్తగా వివక్ష కనిపిస్తొన్ది. తిరుపతి వెంకన్న, శ్రీశైలం మల్లికార్జునుడు, వినాయకుడు ఇలా దేవుళ్ళకు ప్రాంతీయత లెదు. దేవతలకి మాత్రమె ఉంది ..ఇది స్త్రీ దేవతలను ఇంకాస్త దగ్గరగా భావించదమా..లెక వాళ్ళ స్థాయిని తగ్గించదమా అని అనుమానంగా ఉందండీ . మీకు తెలిస్తే చెపుదురూ కాస్త.


అలాగే కవులకి, రాజులకీ మనం అవునన్నా, కాదన్నా ప్రాంతీయత ఉండకుండా పోతుందా ? వాళ్ళ మూలాలను మనం కాదంటే పోతాయా ?


రాష్రంలో సామాజిక వాతావరణం ఎవరికీ అవసరం లేనప్పుడు ఒకరు చెడ గొట్టేది ప్రత్యేకంగా ఉంటుందా .

చెప్పాలంటే...... చెప్పారు...

క్షమించండి మౌళి గారు మీ స్పందనకు ధన్యవాదాలు సీమాంధ్ర దేవుడు కాదులెండి పోనీ సిమాంధ్ర లో ఉన్న దేవుడు అంటే మీకు అభ్యతరం లేదుగా...నేను అజ్ఞానినే అండి... మీ అంత జ్ఞానం నాకు లేదు లెండి ఏదో ఇలా బతికేస్తున్నాము ....దేవుళ్ళు దేవతలు అందరి వారే అండి చూడటానికి వెళ్లి ఉన్న రాద్దాన్తాలు చాలక మళ్ళి కొత్త గొడవలా....చూడాలనుకుంటే చూసి పోవాలి వళ్ళు నోరు దగ్గర పెట్టుకుని...నోటికి ఎంత వస్తే అంత వాగితే మరి ఇలాగే ఉంటుంది....

Mauli చెప్పారు...

పర్వాలేదండీ , నా మొదటి వ్యాఖ్య మీకు అర్ధం కాలేదనుకొంటాను. అందుకే మల్లి చెప్పవలసి వచ్చింది.
సీమంధ్ర లో, ఉన్న దేవుడు, సీమంధ్రలో ఉన్న గాలి, నీరు అతనికి కావాల్సి వచ్చాయా అన్నారు బానే ఉంది.

నీళ్ళు తెచ్చుకోవచ్చు, గాలి పీల్చుకోకుండా ముక్కు మూసుకొని వచ్చి వెళ్ళమని చెపుదాం లెండి తెలంగాణా వాళ్ళందరికీ .


ఎక్కడ ఏం మాట్లాడాడో ఒక్కోరు ఒక్కో కదా. అయినా చెప్పులతో తన్నదానికే వెళ్ళిన వాళ్ళు ఆ పని చేస్తారు కాని, గుడికి వెళ్లిన వాళ్లకి ఆ ఛండాలపు అలవాటు ఏంటండీ . తన్నింది సీమంద్రులే అయితే వాళ్ళు నాస్తికులేమో లెండి .

అవతలి వాళ్ళ గొడవ వదిలేసినా వీళ్ళు చేసింది వెధవ పని, ఇంకా దానికి సమర్ధనలు లాజిక్కులు బాగోవు అండీ .

అజ్ఞాత చెప్పారు...

@jai,
ఒవైసి అధికారంలో ఎవరు ఉంటే వారికి చంచా. వై.యస్.ఆర్. కే కాదు, ఒకప్పుడు బాబు గారితో భుజాలు రాసుకు పూసుకు తిరిగేవాడు. కాని మీరు ఒక హిందువుగా ఎమైనా ఆ సంఘటన పైన ప్రతిస్పందించారా? లేదే. పవిత్ర మాసంలో సాక్షాత్తు వక్ఫ్ మంత్రిపై రోజాలో ఉన్నప్పుడు అంట్టు మైనారిటిలు చంక నెత్తుకోవటానికి బయలుదేరారు. తెలంగాణ అంశంపై మీరు మీటింగులు పెట్టి, ఆ మీటింగులు లకు అయ్యే శ్రమ, డబ్బులు ఖర్చు పెట్టుకొని, ముక్కు మొహం తెలియని మైనారిటి నాయకులను స్టేజ్ మీదకు తీసుకొచ్చి, వారితో మాట్లాడించి అన్ని మీరే చేయిస్తారు. మైనారిటి వర్గాల వారు తెలంగాణ కొరకు ఏమి పోరాడారు? తెలంగాణా కొరకు ఇంత మంది ఆత్మాహుతి చేసుకొన్నారు కదా! అందులో ఎంతమంది ఉన్నారు, మీరు సమర్దించే మైనారిటి వర్గం వారు? ఎవరో బాబా అనే అతను ,బ్లాగుల్లో తెలంగాణా పైన ఓ నాలుగు కవితలు గీకితే ఆయన మద్దతు వలన కూడా తెలంగాణ వచ్చిందని అభినందనలు తెలుపుతూ, మైనారిటిల మద్దతు కోసం మీరు మరీ ఓవర్ యాక్షన్ చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner