1, ఆగస్టు 2013, గురువారం

నాదైతే చాలు...!!

అందాల హరివిల్లుతో ఆటలాడుతుంటే
అగుపించిందో అపరంజి బొమ్మ
చూడ చక్కని చిన్నది చివురాకుల వెనుక ఉన్నది  
చుక్కల దీపాల వెలుగులో దేదీప్యంగా  దీప్తి.... 
పక్కనే ప్రశాంత వదనంతో నేను 
ఎంత బావుందో కమ్మని కల 
ఆశల విహంగాల రెక్కల్లో 
అలల విరుపుల హోయల్లో 
అంతు చిక్కని మౌన సమీరం
మందస్మిత ముగ్ధ రూపం 
నాదైతే చాలు...!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ఎందుకో కొంచెం అస్పష్టంగా ఉంది అయినా బావుంది .

చెప్పాలంటే...... చెప్పారు...

ఎవరో అడిగితె రాసింది అండి అందుకే మీకు అలా అనిపించింది....ధన్యవాదాలు మనసు తెలిసిన మీకు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner