12, ఫిబ్రవరి 2014, బుధవారం

పరమేశుని ప్రతి రూపం....!!

ఈ చిత్ర కవితకు కృష్ణా తరంగాలు సమూహంలో నన్ను ఓ విజేత గా చేసిన నా భావాలు .....

నర్తనమే జీవితం నాద వినోదమే మోదం
అభినయాల అవపొసనల ఆహార్యం
మోద ఖేదాల ముగ్ధ సింగార చందం
అరుణ వర్ణాల హరివిల్లు నయగారం

నవ నాడుల నటరాజ నృత్య విన్యాసం
సృష్టి స్థితి లయల జీవన చైతన్యం
ముచ్చటైన భంగిమల నాట్య విలాసం
పరమేశుని ప్రతి రూపం....అర్ధనారి తత్వం...!!

Manju Yanamadala పరమేశుని ప్రతి రూపం....!!
నర్తనమే జీవితం నాద వినోదమే మోదం
అభినయాల అవపొసనల ఆహార్యం..... ప్రతిదీ భగవత్ సంబంధం తో సరిపోల్చుతూ క్రొత్త వరవడి లో పయనించారు....చక్కని మీ విశ్లేషణ కోసం కృష్ణా తరంగాల కవితా పోటికి కవితలను పంపాలనిపిస్తోంది పార్ధ సారధి గారు...
విజేతలు కవి మిత్రులందరికీ నా మనఃపూర్వక అభినందనలు ... విజేతలను చేసిన అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా నా ధన్యవాదాలు 

3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vemulachandra చెప్పారు...

నవ నాడుల నటరాజ నృత్య విన్యాసం
సృష్టి స్థితి లయల జీవన చైతన్యం
ముచ్చటైన భంగిమల నాట్య విలాసం
పరమేశుని ప్రతి రూపం....అర్ధనారి తత్వం...!!

మనస్పూర్తిగా గర్వించే .... అంత గొప్పగా, కైలాస గిరి అంత ఉన్నతంగా వ్రాసారు
అభినందనలు మంజు గారు!

చెప్పాలంటే...... చెప్పారు...

మనఃపూర్వక ధన్యవాదాలు చంద్ర గారు మీ ఆత్మీయ స్పందనకు అభినందనలకు

Unknown చెప్పారు...

Good

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner