వేసిన మాత్రలు రాసిన లేపనాలు సరిపోలేదేమో
మానుతున్నట్టుగా అనిపిస్తూ అంతలోనే రేగుతూ
అటు ఇటు ఎటూ కాకుండా అలానే ఉండి పోతోంది
కాలానికి చిక్కని మనసు రగులుతున్న కొలిమిలో
నిప్పుల కుంపటిలా సెగలు కక్కుతూనే ఉంది
తగిలిన దెబ్బలకు సాక్ష్యాలుగా చెరిగిపోని
నెత్తుటి చారికల ఆనవాలు కూడా పచ్చబడింది
నలిగిపోయిన జీవితం నవ్వుతూనే వెళిపోతోంది అన్ని చూస్తూ
నిన్ను వదిలేసి నన్ను మాత్రం తన వెంట తీసుకు వెళ్తూ.....!!
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
ఎప్పుడో తగిలిన గాయం .... మానుతున్నట్టుగా అనిపిస్తూ అంతలోనే రేగుతూ .... తగిలిన దెబ్బలకు సాక్ష్యాలై .... నెత్తుటి చారికల ఆనవాళ్ళై .... నలిగిన జీవితం నవ్వుతూ .... నిన్ను వదిలేసి నన్ను మాత్రం తన వెంట తీసుకు వెళ్తూ.....!!
చిక్కని లోతైన భావన నీడలా .... అద్భుతంగా .... అభినందనలు మంజు గారు!
ధన్యవాదాలు చంద్ర గారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి