7, ఫిబ్రవరి 2014, శుక్రవారం

నీ ప్రేమ కోసమేనని... !!

రేయి వాకిట చీకటి పరదా
నా మదిని దాటని నువ్వులా...!!
వెన్నాడుతున్న చాయల నీలి నీడలు
నను వదలని నువ్వులా...!!

మరచి పోదామనుకున్న గతాన్ని
మరువనివ్వని జ్ఞాపకంగా నువ్వు....!!
రాలిపోతున్న రాతి స్వప్నం శిధిలాలు
ఆ ముక్కల్లో ఎక్కడ చూసినా నువ్వే...!!

అందరాని చందమామ అచ్చంగా నీ ప్రేమలా
ఆకాశంలో కూర్చుంది నీలానే సు'దూరంగా'...
మాటేసిన మాయా రక్కసి దాచేసింది నిన్ను
నిదుర రాని మనసుకు కలల తీరం లేదంటూ...!!

నీ కోసం నే ఓడిపోయిన ప్రతి క్షణం చిందిన
నీ విజయ చిద్విలాసం చాటున నేనేనని నా గర్వం
అందుకోలేని ఆశల శిఖరాన్ని తాకాలన్న ఆరాటంలో
వేలసార్లు మరణించినా మరుజన్మ నీకేనని... నీ ప్రేమ కోసమేనని... !!

5 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Very nice Manju gaaru.

Karthik చెప్పారు...

అందుకోలేని ఆశల శిఖరాన్ని తాకాలన్న ఆరాటం... chalaa baagundi Manju gaaru:-):-)

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు కార్తిక్ గారు, వనజ గారు

vemulachandra చెప్పారు...

రేయి వాకిట చీకటి పరదా.... మరచి పోదామనుకున్న గతం .... మరువని జ్ఞాపకం నువ్వు....!!
నే ఓడిపోయిన ప్రతి క్షణం చిందిన నీ విజయ చిద్విలాసం చాటున .... అందని ఆశల శిఖరం తాకే ఆరాటంలో వేల మరుజన్మలు... నీ ప్రేమ కోసమే... !!
ప్రేమకు పరాకాష్ట లా లోతైన భావనల అక్షర రూపం
అభినందనలు మంజుగారు!

చెప్పాలంటే...... చెప్పారు...

మీ ఆత్మీయ స్పందనకు వందనాలు చంద్ర గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner