అద్దంలో ముఖ చిత్రాలు
మనసుని తట్టే మౌనాలు
మాటల కందని భాష్యాలు
కన్నుల కందని స్వప్నాలు
స్వరం మరచిన సప్త స్వరాలు
పెదవులనే దాటని భావాలు
పలికించే ఎద వైనాలు
వినిపించే మురళీ గానాలు
విని పరవశించే ప్రణయాలు
అందించే ఆనందాలు
కురిపించే హిమ వసంతాలు
మురిపించే ముగ్ధ మోహాలు
కలతలు మరచిన హృదయాలు
రేయిని దాచిన వేకువలు
వేకువ మాటున వెన్నెలలు
తొలి పొద్దు అందాలు చందాలు
ఆనాటి చెలిమి సంతకాలు
తాకిన మలయ సమీరాలు
నా వెన్నంటి తిరుగాడే తిమిర సంహరణాలు
పద లయల సవ్వడుల మువ్వల నాదాలు
మురిపించి మెరిపించే తొలకరి చినుకులు
అనునిత్యం నాతోనే నావైన నా జ్ఞాపకాలు...!!
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
"నీలి నీడల్లా అక్షరాలు .... అద్దంలో ముఖ చిత్రాలు .... మాటల కందని మౌన భాష్యాలు .... పెదవులు దాటని సప్తస్వర భావనలు. తొలి పొద్దు అందాలు .... ఆనాటి చెలిమి సంతకాలు .... మురిపెంపు మెరుపు చినుకులు .... అనునిత్యం నాతోనే ఉన్న నా మధుర జ్ఞాపకాలు...."
ఎంత అందమైన ఊహలో మంజు గారి మనోభావనలు నదిలా వడిగా కదులుతూ ఆ మలయానిల వీచికలు
అభినందనలు మంజు గారు! చక్కని భావావిష్కరణ
చంద్ర గారు మీ అభిమాన అక్షర స్పందనకు నా మనఃపూర్వక కృతజ్ఞతలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి