ఒకరి కొకరం చేయూతగా నిలిచి
సమాతరంగా కలసి నడిచే దారి మనది
చేరాల్సిన మజిలి కోసం అలుపెరగక అవిశ్రాంతంగా....!!
నీవో దరిన నేనో దరిన చేరినా
జతగా సాగే ఈ పయనం ఏ గమ్యం కోసమో
కలసిన మన ఇరువురి పరిచయం
ఏ దూర తీరాలకు చేరాలని చేరువ అయ్యిందో...!!
ఊసుల ఊహల ఆశల రెక్కల చాటుగా
మాటలు కలసిన మనసుల మౌనాల మాటుగా
దాగిన ఆంతర్యాల అనుబంధం అర్ధమైన
చెలిమి కలిపిన చివురు తొడిగిన ప్రణయం ఇదేనేమో...!!!
చేరలేని దూరం మన మధ్యన ఉన్నా
చేయి విడలేని సంబంధం మనది
ఎప్పటికి దగ్గర కాలేని సు'దూరం' ఉన్నా
విడలేని జన్మల బంధానికి సాక్ష్యంగా....
ఈ జంట పయనం కడవరకు తోడుగా ...!!
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
నీవో దరిన నేనో దరిన చేరినా, జతగా సాగే ఈ పయనం .... కలవని జీవితాలే అయినా ఎందరినో గమ్యానికి చేరుస్తూ ....
ఎంతో లోతైన భావన .... అభినందనలు మంజు గారు!
ధన్యవాదాలు చంద్ర గారు,
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి