విధి చిన్న చూపు చూసి
విధాతతో నొసటి రాతను
వంకరగా రాయించిందో....
ఆ అయోమయంలోనే
అర్ధ జీవితం గడిచి పోయింది
నాకు తెలియకుండానే...
కన్నీటి ముసురులో అది
మోదమో...అంతులేని ఖేదమో
రెండు కలసిన జీవధార
మనసును తేలిక చేస్తూ
వెలువడిన ఈ కడలి కెరటం
తాకిడి వెల్లువకు కొట్టుకుపోతున్న
ప్రాణాన్ని నిలువరించే ఆయుధం
వెదికే ప్రయాణంలో నిరంతరం
శోధనలో శ్రమిస్తూ...
బంధాలను తెంచుకోలేని
ప్రతి క్షణం మరణిస్తూ జీవించే
జీవితాన్ని నాకుగా నేను రాసుకున్న
నా తలరాతను నేను నిందించుకోవాలేమో...!!
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
నిరంతర శోధనలో .... బంధాలను తెంచుకోలేక, క్షణ క్షణం మరణం నీడలో జీవించే ఈ జీవితం నిందించుకోకతప్పని నేనే రాసుకున్న నా తలరాతేనేమో....!
ప్రతి మనిషి జీవితానికి ఒక అర్ధం ఉంటుంది. ఎంతటి సంఘటననైనా సందర్భాన్నైనా చక్కని పదాలతో అక్షీకరించే మంజు గారి కవితలో చిత్రమైన స్పూర్తిని చూస్తున్నాను. అభినందనలు!
మనఃపూర్వక వందనాలు చంద్ర గారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి