అమెరికాలో జీవితాలు వేరు..వాళ్ళు అలా అలవాటు పడిపోయారు పిల్లలు పెద్దలు కూడా...!! మనం కూడా బంధాలు అలా తెంచుకుంటే ప్రపంచం అంతా గౌరవించే మన వివాహ వ్యవస్థకు అర్ధం లేదు...ఎదుటి వారిలో మంచిని తీసుకోవడానికి ఎన్నో ఆలోచిస్తాము కాని చెడుని తొందరగా అలవాటు చేసేసుకుంటాం...బహుశా ఇది మనిషి నైజం కావచ్చు...అమెరికన్స్ ఎవరిని చూసినా వాళ్ళకు తెలియక పోయినా చక్కని పలకరింపుతో నవ్వుతూ పలకరిస్తారు చాలా వరకు...మనలో ఎంతమందిమి అలా చేయగలుగుతున్నాము..?? ఏ సంస్కృతిలో అయినా మంచి చెడు ఉంటాయి కాని చెడుకి అలవాటు పడినంతగా మంచికి అలవాటు పడలేము..!!
ఆత్మ బంధాలు ఆత్మీయతను పంచాలి కాని అనుబంధాలను తెంచకూడదు....ఈ ప్రపంచంలో ఏ ఒక్కరి ఆలోచనా ఒకటిగా ఉండదు...కొన్ని కొన్ని కలుస్తాయి అలా అని ఒకటిగా ఉన్నా ఎక్కడో ఒక చోట ఈ అహం అడ్డు గోడగా నిలిచి వరకు ఇష్టపడిన ఆ అనుబంధంలో లోపాలు వెదకడానికి ప్రయత్నిస్తుంది....!! ఇదే మన మనస్తత్వం కాదంటారా...!! అప్పటి వరకు కనిపించిన మంచి అయిష్టంగా మారి పోతుంది ఎందుకంటారు...?? జీవితంలో ఆటు పోట్లు ఎవరికీ తప్పవు...కాస్త అనుబదాలకు ఆప్యాయతలకు విలువలు ఇస్తూ బతకడానికి డబ్బు అవసరానికి మాత్రమే అనుకుంటూ ఆ డబ్బే మన జీవితాలను శాసించకుండా బతకడం అలవాటు చేసుకుంటే ఎన్ని జీవితాలు ప్రశాంతంగా ఉంటాయో...!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి