విధి ఆడిన వింత నాటకమో
విధాత చేసిన విడ్డూరమో
అమ్మ ఒడిలో ఆడుతూ
నాన్న నడకలు నేర్పించే
ఆ పసి బతుకులు అటు ఇటు కాని
విధి వంచితులుగా మధన పడే జీవితాలు
సమాజంలో దేనికి నోచుకోని నవ్వులాటగా
మిగిలిన ఈ అసంపూర్తి ఆకారాలు
మమతల మాటున దాగిన వేదనాభరిత
దృశ్య కావ్యాలుగా మన ముందు నిలిచిన
మిగిలి పోయిన ప్రశ్నలుగా ఉండిపోతుంటే
ఎందుకీ కన్నీటి బతుకులు నిర్మించావని
విరించిని వివరణ అడగాలని ఉంది...!!
నేను అడిగిన వెంటనే ఈ సామాజిక సమస్యకు స్పందించిన మనతెలుగు మన సంస్కృతి నిర్వాహకులు త్రినాధ్ గారికి ప్రతేక కృతజ్ఞతలు..... కనీసం విధి చేసినా వీరి పేరు చెప్పి ఎవరు ఎవరిని మోసం చేయవద్దని కోరుకుంటూ ఈ నా చిరు కవిత వారికే అంకితం
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి