5, ఏప్రిల్ 2014, శనివారం

పెద్ద మనసు చేసుకుని మన్నించండి...!!

ఎలా మొదలు పెట్టాలో తెలియని పరిస్థితి చెప్పక పొతే నా మనసు ఊరుకోదు...అయినా నాకు అనిపించిన నిజాలు అని నేను నమ్మిన విషయాలు ఎవరు ఎలా తీసుకున్నా చెప్పకుండా ఉండలేను..మరి ఇదే నా బలహీనతేమో....!! ఎవరైనా డాక్టర్ దగ్గరకు ఎందుకు వెళతారు బాలేక పోతేనే కదా.. చిన్న చిన్న వాటికి కూడా స్పెష్సలిస్ట్ దగ్గరకి వెళ్ళేంత అవసరం బాగా డబ్బులు ఏం చేసుకోవాలో తెలియని వారు మరి వెళతారేమో....ఎవరమైనా మనకి పని పాటు లేక డాక్టర్ దగ్గరికి లాయర్ల దగ్గరికి వెళ్ళము నాకు తెలిసి.... మహాత్మాగాంధీ, వివేకానందుడు ఫోటోలు పెట్టేసుకుని....నాలుగు నీతి వాఖ్యాలు గోడలకు అంటించేసి అబ్బో నేను చాలా మంచి వాడినే అనుకుంటే సరిపోదు...మంచితనం ప్రజలకు లేని వారికి సేవ చేయాలనే మంచి మనస్థత్వం మీకు ఉండి ఉండొచ్చు....దానికి మా శతకోటి వందనాలు...మానవ బంధాలన్నీ ఆర్ధిక బంధాలు అన్న మంచి సూక్తులు గోడలకు పరిమితం కాకుండా జీవితాలకు కూడా అన్వయించుకోగలగాలి....మహాత్ముల ఫోటోలు గోడలకు తగిలించుకుంటే సరి పోదు... కనీసం వారిలో కాస్తయినా సహనం అన్నది వైద్యునికి ఉండాలి...మీరు గొప్ప చదువులు చదివి ఉండొచ్చు కాదని ఎవరు అనరు కాని ప్రతి దానికి ఎదుటి వారిలో తప్పులు వెదకకుండా వారి బాధను అర్ధం చేసుకునే ప్రయత్నం చేయండి....మీకున్నంత వైద్య పరిజ్ఞానంలో చెప్పగలిగే భాష వారికీ ఉండక పోవచ్చు... కళ్ళు తిరిగాయి అని చెప్పాము అనుకోండి ఏమి కనపడలేదా.... అని మీరు అడిగితే శ్వాస కూడా అందలేదు అని చెప్తే అయితే అలా చెప్పాలి కాని ఇలా చెప్తే ఎలా అంటే ఏం చెప్పగలం చెప్పండి... మెదడుకి సరిపోయినంత గాలి అందక పోతేనే కదా అలా అవుతుంది... వాడుక భాషలో కళ్ళు తిరిగాయనే చెప్తాము... నాకు తెలిసి...!! కావాలని ఎవరి ప్రతి చిన్న దానికి స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్లి అక్కడ పడిగాపులు పడరు....మీకు మీరు చేసే వైద్యంలో బాగా అనుభవం ఉందనే మీ మీద నమ్మకం తోనే వస్తారు....
ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు మీ అందరితో పంచుకోవాలని నాకు రాసే ఓపిక లేక పోయినా రాస్తున్నా... దయచేసి డాక్టర్లు ఎవరు నా మీద కోపం తెచ్చుకోకండి.... నాకు విటమిన్ బి 12 తేడా ఉంది... అది నేను అమెరికాలో ఉన్నప్పుడు చేయి నొప్పి కోసం వెళితే ఆయన ఇది కూడా టెస్ట్ చేయించమంటే చేయించాను... 180 అప్పుడు ఉంది... ఆ డాక్టర్ అప్పుడు వివరంగా చెప్పారు ఇది తక్కువ ఉంది మాములుగా మన శరీరానికి మనం తినే ఆహారంలో రోజు చాలా తక్కువ మోతాదు లోనే బి 12 కావాలి.... కాకపొతే నీ శరీరం దాన్ని ఉంచుకోవడం లేదు బయటకు వదలి వేస్తుంది.... ఇది 50 కి వెళితే నరాలు సరిగా పని చేయవు... తరువాత నీకు అది 400 కాదు 600 కు వచ్చినా ఉపయోగం ఉండదు అని చెప్పారు... అప్పటి నుంచి ఆ ఇంజక్షన్స్ చేయించుకుంటూ ఉంటే నేను ఇండియా వచ్చే ముందు అక్కడే టెస్ట్ చేయించుకుంటే 298 ఉంది.. అప్పటికి 2 ఇయర్స్ నుంచి చేయించుకుంటున్నా... జీవితాంతం చేయించుకోవాలి అని చెప్పారు నెలకి ఒకటి చొప్పున ముందు రోజు  చేసి తరువాత వారానికి ఒకటి 15 రోజులకి ఒకటి ఇలా చేసి...ఇండియా వచ్చాక నేనే కాస్త అశ్రద్ధ చేసాను కొన్ని చోట్ల ఆ టెస్ట్ గురించి అడిగితే లేదని చెప్తే అలా ఊరుకున్నా రెండున్నర్ర ఏళ్ళు చేయించుకోలేదు... నాకు బాగా తేడా తెలుస్తోంది ... నేను పని చేసే ఆఫీసులో రమేష్ అని వాళ్ళ చెల్లెలు కేర్ లో పని చేస్తుంది... అయ్యా ఈ టెస్ట్ ఉందేమో కనుక్కో అంటే వెంటనే కనుక్కుని నన్ను తనే తీసుకువెళ్ళి టెస్ట్ చేయించాడు.. ఫాంలో డాక్టర్ అన్న చోట సెల్ఫ్ అని రాశాను... ఇలా ఎవరు చేయించుకోరు అండి అంటే నాకు అది బ్లడ్ లో ఎంత ఉందో కావాలి అని వివరాలు చెప్తే చేసి ఇచ్చారు... 98 ఉంది... అది తీసుకుని చినకాకాని లో ఎన్ ఆర్ ఐ హాస్పటల్ కి వెళ్ళి అక్కడ చూపిస్తే అమెరికాలో ఆయన ఏం చెప్పారో అదే మాట చెప్పి మళ్ళి ఇంజక్షన్స్ మొదలు పెట్టాను....ఇది ఒక కధ....
ఈ మధ్య కాస్త కాళ్ళు వేళ్ళు నొప్పులు కొంగర్లు పోతున్నాయి అని ఒక పేరున్న ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్ళాను.. ఇలా నాకు బి 12 తక్కువ ఉంది అని చెప్తే నువ్వేం స్పెషల్ కాదు అది అసలు ఎవరికీ ఉండదు అన్నాడు....అది అయి పోయింది నా ఇంజక్షన్స్ నా గోలా మామూలు గానే సాగుతోంది...ఒక ఆరువారాల క్రిందట నాకు బాగా తేడా చేసింది కాసేపు ఏమి తెలియలేదు తరువాత బాగా ఫిట్స్ లా వచ్చాయంట...మా చిన్నబాబు ఆ టైం లో ఇంట్లోనే ఉన్నాడు ఎప్పుడు ఉండదు లెండి వాడు ఆడుకుంటూ ఉంటాడు అ రోజు నా కోసమే ఉండి ఉంటాడు... చూసి భయపడి పక్క పిల్లలని పిలిచి ఎదురుగుండా మా వాళ్ళే ఉంటారు వాళ్ళని పిలవమని....మొత్తానికి మా ఇంటి వారు కూడా చాలా మంచి వారు అందరు కలసి దగ్గరలోని హాస్పటల్ కి తీసుకువెళ్ళి మళ్ళి పునర్జన్మని ఇచ్చారు... కాకపొతే ఒక గంట వరకు జరిగినది నా మైండ్ లోకి వెళ్ళలేదు.. సి టి స్కాన్ చేసారు.. మొత్తానికి వైద్యం బానే చేసారు... మరుసటి రోజు విజయవాడలో బాగా పేరున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాము....చూసి చెప్పారు... ఎక్స్ రేలు తీసారు... వెన్నెముకలో తేడా ఉందని మళ్ళి ఎం ఆర్ ఐ చేయించారు...ఇవి అన్ని అవసరాన్ని బట్టి మాత్రమే చేయిస్తారు...డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టించరు...కాని నాకు తెలిసిందే వేదం అనే రకం... ఏం జరిగింది అంటే కళ్ళు తిరిగాయని చెప్పాను. సి టి స్కాన్ చూసి బ్రెయిన్ డెడ్ అయింది కాసేపు అని చెప్పి ఒక్కోసారి అలానే గుండె ఆగి పోతుంది అని చెప్పారు .... మందులు ఇంజక్షన్స్ అన్ని ఇచ్చారు... అసలు చాలా రోజుల వరకు పూర్తిగా ఏం జరిగింది అని నాకు తెలియదు...అంటే ఏం కనిపించలేదా అని అడిగితే శ్వాస కూడా అందలేదు అని చెప్పా అయితే అది చెప్పాలి చెప్పడం రాక పొతే ఎలా... ఇక అది ఇది అని కాసేపు మాట్లాడారు... నాకు బి 12 తేడా ఉంది అని చెప్తే అసలు అది లేదు అమెరికా వాళ్ళు అలానే చెప్తారు అని ఏదేదో మాట్లాడారు...

విటమిన్ బీ12 వికీపీడియా నుండి



మన నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి, ఎర్ర రక్తకణాల తయారీకి బీ12 విటమిన్ తప్పనిసరి. దీని లోపం కొద్ది మోతాదులోనే ఉంటే కండరాల బలహీనత, నిస్సత్తువ, వణుకు, మూత్రం ఆపుకోలేకపోవటం, రక్తపోటు తక్కువ కావటం, కుంగుబాటు, మతిమరుపు వంటి గ్రహణ సమస్యలు తలెత్తుతాయి. ఇక లోపం మరీ తీవ్రమైతే మాత్రం రక్తహీనతకు దారితీస్తుంది. అన్ని బీ విటమన్ల మాదిరిగానే బీ12 కూడా నీటిలో కరుగుతుంది. అయితే మోతాదు ఎక్కువగా ఉంటే దీన్ని మన శరీరం.. కాలేయం, కణజాలాల్లో నిల్వ చేసుకుంటుంది. అందువల్ల ఆహారం ద్వారా తగినంత బీ12 తీసుకోకపోయినా చాలాకాలం పాటు రక్తంలో దీని మోతాదు తగ్గినట్టు కనిపించదు. ఒకవేళ నిల్వ మోతాదు తక్కువగా ఉంటే చాలా త్వరగానే బీ12 లోపం కనబడొచ్చు. పిల్లల్లోనైతే అంతకన్నా ముందుగానే ప్రభావం చూపుతుంది...... 
మళ్ళి  నేను చూపించుకున్న ఇద్దరు డాక్టర్లు ఎముకలు నరాలలో బాగా పేరున్న వారు... ఇంత చిన్న విషయం వారికి తెలియక పోవడం అనేది మరి రోగి దురదృష్టం అనుకోవాలి...నాలుగు రోజుల  నుంచి బాగా బాలేక మళ్ళి వెళితే అంటే నాకు రమ్మని చెప్పిన సమయం కన్నా ముందు వెళ్ళాను మామూలు ఎం బి బి ఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి... మీ అందరికి ఇలా అలవాటు అయిపొయింది అని మరో పెద్ద క్లాసు :) వార్డు మెంబర్ తో అయ్యే పనికి ప్రసిడెంట్ దగ్గరికి రాకూడదు...నేను చెప్పాను మా మామయ్యకి ఫోన్ చేసి ఇలా ఉందని చెప్పాను అండి వేరే టెస్ట్ చేయించారు...మిమ్మల్నే కలవమన్నారు అని కూడా చెప్పా...ఇదేమన్నా అమెరికానా ఫోన్ లో వైద్యం చేయడానికి అంటూ ఇలా ఏదో ఒకటి మాట్లాడుతూ కనీసం మనం చెప్పే సమయం కూడా ఇవ్వరు.... మళ్ళి బయట చాలా చక్కగా మాట్లాడతారు...!!
మా పెదనాన్న చాలా గొప్ప డాక్టర్..... ఆయన చదివింది ఆ రోజుల్లో ఎం బి బి ఎస్ మాత్రమే... ఆయనా దేశాలు తిరిగి వచ్చారు... మనం పది రూపాయలు ఖర్చు పెట్టుకు వెళితే 3 రూపాయల మందులతో తగ్గించేవారు. మనం ఎం చెప్పనక్కర లేదు నాడి పట్టుకుని అన్ని ఆయనే చెప్తారు...ఆయన  ఆరోగ్యం సహకరించక ఇప్పుడు ఊరికినే ఉండలేక హోమిహోలో చూస్తున్నారు... మా మామయ్య అని చెప్పాను ఆయన కూడా చక్కని వైద్యం చేస్తారు..ఇద్దరు కలసి చాలా రోజులు చేసారు అందరికి అందుబాటులో... ఆయనా దేశాలు వెళ్లి వచ్చారు...కాకపొతే కొద్దిగా కోపం ఉండేది ఆయనకు చెప్పిన సమయానికి రాక పోయినా మందులు సరిగా వేసుకోక పోయినా....!!
అమెరికాలో వైద్యం గురించి ఇక్కడ మన వాళ్ళలో చాలా చిన్న చూపు ఉంది కాని వారి దగ్గర మనం నేర్చుకోవాల్సిన ఆ సహనం ఒక డాక్టర్ అనే కాదు హాస్పటల్ లో ప్రతి ఒక్కరు పాటిస్తారు కాక పొతే వైద్యం చేయడానికి కాస్త సమయం తీసుకుంటారు....!!
మా ఉరికి ఎర్ర బస్ లేక పోయినా సరస్వతికి పుట్టినిల్లు....మీరు ఎంత గొప్ప పేరున్న డాక్టర్ అయినా మీకు తెలియనిది ఎదుటి వారు చెప్పినప్పుడు విని నిజం ఉందో తేదో తెలుసుకోండి...మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకు వచ్చే రోగి జీవితంతో ఆడుకోకండి....దయచేసి సహృదయంతో అర్ధం చేసుకోండి...మేము ఎప్పుడు వైద్యో నారాయణో హరీ...అని మిమ్మల్నే తలచుకుంటాము...మీకు ఒపిక లేనప్పుడు వైద్యం మానేయండి...మా జీవితాలతో మాత్రం ఆడుకోకండి....!! నాకు ఆరోగ్యం ఇలా అవడానికి కారణం అయిన ప్రతి  ఒక్కరు ఇకనయినా ఎవరిని ఇలా బాధపెట్టకండి....ఈ నా మనసు మాటలు ఎవరినైనా ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని బాధ పెట్టి ఉంటే పెద్ద మనసు చేసుకుని మన్నించండి...!!

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అజ్ఞాత చెప్పారు...

నేను మీలాంటి బాధితుడునే! చెప్పాలంటే అదో పెద్ద కథ.

దీనికి రెండు కారణాలు.
1. ఇక్కడి డాక్టర్లకు CE (continuing Education) అనేది అంత గట్టిగా కంపల్సరీ కాకపోవటం వలన డబ్బులు వచ్చే క్రొత్త ఆపెరేషన్ ల గురించి తెలుసుకొన్నంత శ్రద్దగా బేసిక్ స్కిల్స్ update చేసుకోకపోవటం, అంతేకాక ఒక సారి లైసెన్సు వచ్చిన తరువాత బోర్డు పరీక్షలు పస్స్ కావాల్సిన అవసరం అమెరికాలో లాగా లేకపోవటం వలన వీళ్లు రోజు రోజు కు మారుతున్న బేసిక్ స్కిల్ల్సు పెంచుకోకపోవటం.

2. అమెరికాలో తప్పుడు డయాగ్నస్టిక్ చెస్తే దానివలన ఎంతో డబ్బులు (పేషంట్సు సూ లవలన) పోయే అవకాశం ఉండటం, మరీ తప్పు చేస్తే వాళ్ళ లైసెన్సు కేన్సిల్ అయె అవకాసం ఉండటం, జైల్ కెళ్లాలసి రావడం కూడ జరుగుతుంది. అందుకని అందరు డాక్టర్లు డయాగ్నస్టిక్ విషయం లో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇక్కడ ఆ భయాలు లేకపోవటం వ్లన చాలా చాలా మంది డాక్టర్లు, ముఖ్యం గా పేరు ఉన్న వాళ్ళు నిర్లష్యం గా ఉండటం జరుగుతుంది.

ఇక ఇక్కడ డాక్టర్లకు ప్రస్తుతం అమెరికా లో ఉన్న చాలా మంది డాక్టర్ల కంటే ఎక్కువ సంపాదించే అవకాశాలు పేరు వస్తే ఉండటం వలన దానివలన వచ్చే తలబిరుసు, అన్నీ మాకు తెలుసు అనే mentality ఇంకో కారణం.

B-12, విటమిన్-డి అనేవి ఓ లోపాలు కావు, అనే famous డాక్టర్స్ మనకు ఉండటం మాతం మన ఖర్మ. ఏ మాతం నీరసం గా ఉన్నదంటే మొట్టమొదట చెసే test లలో ఆ రెండు test లు ఉంటాయి అమెరికా లో.
మీకు వెసులు బాటు ఉంటే వెంటనే U.S/U.K. లలఓ చేసి ఈ మధ్యనే (ఇంకా ఇక్కడి చలా మంది డాక్ట్ర్ల attitude వంటపట్టి ఉండని) ఇండియా వచ్చేసిన వాళ్ల consultation తీసుకోండి.

చెప్పాలంటే...... చెప్పారు...

మీరు పేరు రాయలేదు మీరు చెప్పిన ప్రతి అక్షరము నిజమే అండి... ఆ వివరాలు కూడా రాద్దామనే నేను అనుకున్నా ఇప్పటికే నన్ను నేను రాసేది చదవలేక తిట్టుకుంటున్నారు అని ఊరుకున్నా..... అతి విలువైన మీ వివరాలకు నా మనఃపూర్వక కృతజ్ఞతలు

సిరిసిరిమువ్వ చెప్పారు...

జాగ్రత్త అండి. నాకు కూడా B12 డెఫిషియన్సీ ఉందండి. మీలాగే నాకూ చేతి వేళ్ళు కొంగర్లు పోవటం..నొప్పి ఉంటాయి. సంవత్సరం బట్టి ఇంజక్షన్సు తీసుకుంటున్నాను..ముందు రోజూ..తర్వాత వారానికి ఒకటీ..ఇప్పుడు నెలకు ఒకటి! B12 లెవెల్ పెరిగింది కదా అని ఇంజక్షన్సు మానటానికి లేదు...తీసుకుంటూనే ఉండాలి. హైదరాబాదులో B12 టెస్టు చిన్న చిన్న డయాగ్నస్టిక్ సెంటర్సు లో కూడా చేస్తారండి.

కొన్ని విషయాలు డాక్టర్సు కన్నా మనకే బాగా తెలుస్తాయి. వాళ్ళు వాళ్ళకి తెలిసిందే జ్ఞానం అనుకుంటారు. మనం చెప్పింది వినిపించుకోరు. ఏమీ జరగక ముందు మనకున్న లక్షణాల బట్టి మనం వెళ్తే ఏముందని వచ్చారు అంటారు..కాస్త ఆలస్యంగా వెళ్తే అంతా అయిపొయ్యాక వచ్చి మా ప్రాణాలు తీస్తారు అని విసుక్కుంటారు. ఈ రోజుల్లో చాలా మంది డాక్టర్సు ఇలాగే ఉన్నారండి. మన జాగ్రత్తలో మనం ఉండటమే!

B12 లోపం అంత భయపడాల్సిన విషయం కాదు..మీరు ఇంజక్షన్సు ఆపకుండా తీసుకుంటూ ఉండండి.

మీ అనుభవాలు నలుగురితో పంచుకోవటం అందరికీ ఉపయోగమే కదండీ..అందుకని పంచుకోండి...తిట్టుకుంటారని ఊరుకోకండి.

Hope you are better now. Take care!

చెప్పాలంటే...... చెప్పారు...

భయపడలేదు అండి వాళ్లకు తెలియలేదే అన్నది నా బాధ అంతే..నేను చేయించు కుంటూనే ఉన్నా... అది ఇప్పుడు సమస్య కాదు నాకు .....చాలా సంతోషంగా ఉంది మీ స్పందనకు ధన్యవాదాలు సిరిసిరి
మువ్వ గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner