15, జూన్ 2014, ఆదివారం

ఈ పయనం ఎక్కడికో....!!

నడిపించిన నాన్న పెంచిన ఆ క్షణాలు
నే వదలివేసిన అక్షరాల అనుభవాలు
అన్ని కలిపిన జీవిత నిత్య సత్యాలు
మలచిన మౌన సంతకాల సాక్ష్యాలు
సు'దూర'మైన ఆవలి తీరం చేరాలని
లోనికి లాగే సుడిగుండాలను తట్టుకుంటూ
తరలి పోతున్నా ఏదో ఒక పెనుగాలి హోరు
చుట్టుకుంటూ ఎప్పుడు వెంటపడుతూనే
పెను తుఫానుల మధ్యన నలుగుతూ
గమ్యం తెలిసినా చేరలేని చెంత లేని
తెలిసి తెలియని ఈ పయనం ఎక్కడికో....!!
అమ్మా నాన్నలకు ఒక రోజంటూ కేటాయించి మన బాధ్యతను సరిపెట్టుకుంటున్న అందరికి .... సరిపుచ్చుకుంటున్న అమృతమూర్తులు నాన్నలకు శుభాకాంక్షలు

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vemulachandra చెప్పారు...


నడిపించాలనే ఆశ నాన్నది. నాడు మొరాయించి ఇప్పుడు మదనపడే మది నాది
గమ్యం తెలిసీ చేరలేని ఈ అవిటి పయనం ఎక్కడికో....!
ఆణిముత్యాల్లాంటి మాటలు
అభినందనలు మంజు గారు!

చెప్పాలంటే...... చెప్పారు...

మీ అమృత వాక్కులకు నా ప్రణామాలు చంద్ర గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner