చూపించు వేల తారల జిలుగులు
మనసులో నిలచిన చివురంత ఆశ
జీవితపు చివరి అంచుల వరకు
ఆనందాన్ని అందుకోవాలన్న ఆరాటం
మనసు మౌన అలజడిని మార్చుతూ
పయనాన్ని గమనాన్ని గమకాలుగా
జగాన గెలవాలన్న కొండంత కోరిక
నచ్చిన నెచ్చెలి మెచ్చుకోవాలన్న తపన
గుండెల్లో నింపుకున్న అలుపు ఆరాటాన్ని
అందని ఆకాశాన్ని హద్దుగా చేసుకుని
మబ్బులు కమ్మిన మేఘపు వెలుగును
కటిక చీకటిని చీల్చుకుని వచ్చే తుషారాన్ని
తమకంగా తడిమే ఆ మలయసమీరపు
తడిని తాకిన పులకరించిన తనువులోని
మనసు మకరందం అందుకున్న ఆర్తిలోని
అనుబంధపు పోరాటం గెలుపు కోసం
నిరంతరం సమస్యల చిరునవ్వులతో
చెలిమిని పంచుకుంటూ సాగే
సరిగమల సంగతుల సాహిత్య విన్యాసాల
అటు ఇటు ఎటు పడిపోకుండా
క్రమ పద్దతిలో సాగే నృత్య తరంగాల
జీవిత నాటక చదరంగంలో పావులమై
విజయం కోసం నిచ్చెనల ఆసరాతో
ఎదగాలన్న కొండంత ఆశను
నింపుకుని ఎదురుచూపుల నిరీక్షణ....!!
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
మంజు గారు! శుభోదయం!!
గెలుపు కోసం .... సమస్యల చిరునవ్వులతో చెలిమిని పంచుకుంటూ సాగే, సరిగమల .... సాహిత్య విన్యాసాల నృత్య తరంగాల
జీవన నాటక చదరంగం
జీవితాన్ని అధ్యయనం చేసి రాసినట్లు .... ఒక చక్కని కవిత
అభినందనలు
మీ స్పందనకు నా వందనాలు చంద్ర గారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి