8, జూన్ 2014, ఆదివారం

ఏకాంతంలో నాకు నేనుగా....!!

నమ్మక తప్పని నిజమైనా
శోధన తప్పని వేదననైనా
బతకక తప్పని జీవితమైనా
ఒంటరి పయనం తప్పని దారైనా
అన్ని ఉన్నా ఏది నాది కాకున్నా
ఎందరున్నా ఎవరు లేకున్నా
విధి రాతకు ఎదురీదాలన్నా
మది సంగతి మరపుకు రాకున్నా
మనసు గతి మార్చుకోలేకున్నా
మంచు శిలగా మారాలనుకున్నా
కఠిన శిలగా కరకు రాతిగా కనిపించినా
మండుతున్న అగ్ని కణమైనా
చల్లారే సమయం కోసం ఎదురు చూసే
క్షణాల ఆరాటాల ఈ రాలిపోతున్న
రాతి కణం ఎక్కడో రాలి పోతున్నదన్న
నిజాల అంతరంగం చల్లారే సమయం
ఈ జన్మకు లేదని తెలిసినా తప్పని

బంధాల మధ్యన నలుగుతున్న
మధ్య తరగతి మనసుని మార్చలేకున్నా
తెంచుకోలేని మమతలను తుంచుకోలేకున్నా
అందుకేనేమో ఇలా మిగిలిపోయాను
ఎందుకో నా ఈ ఎదురుచూపుల

ఏకాంతంలో నాకు నేనుగా ఇష్టంగా....!!

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Me With Myself చెప్పారు...

Nice Post, Plz read my stories @ http://sadikaamar.blogspot.in/ , if you like it please share in your circle.

చెప్పాలంటే...... చెప్పారు...

Thank u andi i will

vemulachandra చెప్పారు...

మండే అగ్ని కణం .... చల్లారే సమయం .... క్షణాల ఆరాటం లో రాలిపోయిన .... నిజాల అంతరంగం చల్లారే సమయం
ఈ జన్మకు లేదని తెలిసినా తప్పని .... ఏకాంతం

మనసు భావనలను చాలా సున్నితంగా మలచడం మంజు గారికే కుదురుతుందన్నట్లు

అభినందనలు మంజు గారు

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు మీ స్పందనకు చంద్ర గారు ...మీ అంత బాగా రాదు కాని అండి ప్రయత్నిస్తున్నా

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner