దగ్గరగా ఉన్నా దూరం దగ్గరగానే ఉంది
ఎందుకో దూరం ఇలా ఆడుకుంటోంది
మన మధ్యన దాని పెత్తనం ఏంటో..!!
ఎంత దూరంగా నేట్టివేసినా పక్క పక్కనే
ఉన్న మనతో దాని ఆటల హంగామాలతో
దోబూచులాడుతూ నమ్మకంతో పట్టి దూరంగా
పారవేయలేవంటు ఎంత ధీటుగా ఉందోచూశావా...!!
దగ్గరకాలేని దగ్గరతనం ఏమి చేయలేక
దూరంగానే ఉండిపోతూ దూరమౌతోంది
ఏమిటో ఈ దగ్గర దూరం ఇలా మనతో
ఆడుకుంటూనే ఎటూ కాకుండా చేస్తున్నాయి...!!
కాలం చూస్తూనే వెళ్ళిపోతోంది
క్షణాల గంటలను మోసుకుంటూ
మన కోసం ఆగలేనని విచారాన్ని
అందిస్తూ దురాన్ని దూరంగా విసిరి వేయలేక....!!
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
మన(సు)కవి ఆత్రేయ గారిని గుర్తుకు తెచ్చారు . చక్కగా వుంది .
ఎంత గొప్ప మాట అన్నారు శర్మ గారు ..ధన్యురాలిని ఇంట కన్నా నాకు ఇంకేం కావాలి
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి