వలపు తలపుల వాయనాలు వడ్డించే
వగలు పోయే వయ్యారిని కాదు
అబద్దాల నిజాలు చెప్పి మోసపుచ్చే
అమ్ముడుపోయే న్యాయాన్ని కాదు
మాట ఇచ్చి మరచిపోయే మనసు లేని
మౌన భాష్యాన్ని దాచుకున్న మోసపు
హృదయాన్ని అందుకున్న చెలిమిని కాదు
పగలు సాయంత్రాలు పూర్తిగా భరించే
బంధాల అనుభందాల చాటున ఒంరటిగా
మిగిలిపోయిన అతి సామాన్యురాలిన...!!
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
భావం బాగుంది . కొన్ని పదాల చివర కొంచెం మారిస్తే యింకా బలమైన భావ ప్రకటన జరిగి వుండేది అనిపించింది .
పగలు సాయంత్రాలు పూర్తిగా భరించే
బంధాల అనుభందాల చాటున ఒంటరిగా
మిగిలిపోయిన అతి సామాన్యురాలిని...!!
ఈ పదప్రయోగం చాలా బాగుంది .
ఏదో అనిపించి మొదలు పెట్టాను అండి ఇంకా బాగా రాయడానికి ప్రయత్నిస్తాను మీ అభిమానానికి కృతజ్ఞురాలిని శర్మ గారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి