23, నవంబర్ 2016, బుధవారం

గుట్టు బయటపడిన రోజు...!!

నేస్తం,
          మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్న విషయమే అయినా మళ్ళి మళ్ళి మాట్లాడాల్సి వస్తోంది. మనం ఏదైనా పోస్ట్ కానీ బొమ్మ కానీ పెట్టినప్పుడు దానిపై వచ్చే విమర్శలకు, అభినందనలకు వెరసి స్పందనలకు మనమే బాధ్యులం అవుతాము కదా.. మనకు నచ్చిన వాటికి తిరుగు సమాధానాలిస్తూ, నచ్చని స్పందనలను తీసేయడం ఎంత వరకు సమంజసం..? ఆ మధ్యన కూడా నేను ఒక విషయం గురించి రాసినప్పుడు ఒకావిడ వేరే వాళ్ళ మీద తనకున్న అక్కసునంతా కొందరి సలహాతో వెళ్ళగక్కి .. తాను అనుకున్నట్టుగా నా నుంచి సమాధానాలు రాకపోయే సరికి తన స్పందనలు మొత్తం తీసేసింది. ఈరోజు ఓ ఫోటోకి రెండు స్పందనలు పెడితే పెట్టిన మరుక్షణమే తీసేసారు. తమకు నచ్చని కామెంట్స్ పెడితే తీసేయడం ఎంత వరకు కరెక్ట్. మన ఫోటో మనం పెట్టుకుంటే తప్పు లేదు వేరే వాళ్ళది మనతో కలిసి ఉన్నప్పుడు పెట్టె ముందే వాళ్ళ అభిప్రాయం తెలుసుకుని పెట్టాలి లేదా మన వరకు పెట్టుకోవాలి అంతే కానీ మనం కనిపించేటట్టు పెట్టి పక్కన వాళ్ళని కనపడకుండా చేసి పెట్టడం సంస్కారం అనిపించుకుంటుందా..? అలా కనపడకుండా పెడితే అందరు అడగకుండా ఉండరు కదా.. మరి ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగితే మనం కనిపించం అక్కడ -:)
 ఇంకో కేటగిరీ వాళ్ళేమో రెండు మనసుల చిత్ర సరాగాలుగా చిత్ర సందేశాలు "నువ్వక్కడ నేనిక్కడ .... " అంటూ వగైరా వగైరా సందేశాలు .. ఇవి అన్ని వయసు పైబడిన వాళ్ళ ఆటలు ఈ ముఖ పుస్తకంలో. మరి వీళ్ళకు ఇంట్లో లేనిది ఇక్కడ ఏం దొరుకుతుందో.. ఇక మరికొంతమందేమో అన్నయ్య గారు / అక్కయ్యగారు అంటూనే కొంపల్లోనే కాకుండా స్నేహితుల మధ్యన కూడా నన్ను పిలిచారు నిన్ను పిలవలేదా అంటూ చిచ్చు పెడతారు. వాళ్ళ వ్యాపారాలు పెంచుకోవడం కోసం ఎన్నో వేషాలు వేస్తూ ఉంటారు ఈ ముఖ పుస్తకం వేదికగా. ఇంట్లో తమ బంధాలు ఉన్నా వారిని నిర్లక్ష్యం చేస్తూ మరి ఈ విపరీత ధోరణులు ఎందుకు అన్నది వారికే తెలియాలి. ఈ చాటుమాటు వ్యవహారాలు ఎన్నో రోజులు దాగవు. నిలబడవు కూడాను. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ఎవరు చూడటం లేదులే అని సరిపెట్టుకుంటే ఎలా .. గుట్టు బయటపడిన రోజు మీ నైతిక విలువ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అన్ని తెలిసినా మౌనంగా ఉంటుంటే అది చాతకానితనంగా తీసుకోవద్దు. మీలో మార్పు కోసం మీకోసం ఎదురుచూసే మనిషిని మీరు గుర్తిస్తారేమో అన్న చిన్న నమ్మకం. దయచేసి దాన్ని నిలబెట్టుకోండి, మీ గౌరవాన్ని కాపాడుకోండి.

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

SwatySatya చెప్పారు...

అవునక్కా !
ఇలాంటివాళ్ళకు ఫేస్ బుక్ లో లోటు లేదు. ఒకరిని వెదకడానికి వెడితే వందమంది దొరుకుతారు.
మనకి తెలిసినవాళ్ళు , స్నేహితులలోనే ఇలాంటివాళ్ళు ఉండడం నిజంగా దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు
చాలామంది ఎదుర్కుంటున్నవే . వాళ్ళ జీవితాల గురించి తెలిసినవాళ్ళు పోస్టులు పెట్టడం మొదలుపెడితే
ఇలాంటివాళ్ళు ఫేస్ బుక్ వదిలేసి పారిపోతారు. ఈ పోస్ట్ చూసైనా కొంతమంది మారితే మంచిదే. లేకపోతే
వాళ్ళు తీసుకున్న గోతిలో వాళ్ళు పడినట్లే. నైస్ పోస్ట్ అక్కా .!

శ్రీ చెప్పారు...

Tholu mandam unnavaallaku thappa...
Ee post ... chernaakolu debbalaa tagile teerutundi Manju garu.
Kaneesam konthamandainaa budhdhi techchkunte mee post ki prayojanam sidhdhistundi.

Baagaa endagattaaru
Payomukhavishakumbhaalani �� great.

చెప్పాలంటే...... చెప్పారు...

Thank u andi

చెప్పాలంటే...... చెప్పారు...

Thank u Swathi

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner