ఇప్పటికి ఈ ముచ్చట్లకు సశేషం....
10, ఏప్రిల్ 2018, మంగళవారం
జీవన 'మంజూ'ష (7)..!!
నేస్తం,
నాలుగు తరాల అనుభవాలను అందిపుచ్చుకున్న జీవితం కాసిన్ని అనుభూతులను పంచుకోమంటూ ఆహ్వానిస్తోంది. వడ్లు దంపుకు తిన్న ఆ రోజుల అనుభవాలు, గొప్పగా బ్రతకకపోయినా గుంభనంగా గుట్టువిప్పని అనుభూతులను, పంచుకున్న తాయిలాలను, పట్టుపరుపుల మీద పడుకోకున్నా పండువెన్నెల్లో పంచుకున్న బంధాలను, కష్టం వస్తే కలిసికట్టుగా పెనవేసుకున్న అనురాగాలను ఇలా ఎన్నెన్నో ఆనాటి కబుర్లను అమ్మమ్మ కథలుగా చెప్తుంటే వింటూ..
అమ్మ పక్కలో పడుకుని అమ్మ చదివే చందమామ కథలు వింటూ ఆరుబయట వెన్నెల చల్లదనాన్ని అందిపుచ్చుకుంటూ, ఆటలాడుతూ చదివిన చదువులను నెమరువేసుకుంటూ అందరి మధ్యలో పెరిగిన బాల్యాన్ని, చుట్టపు చూపుల చుట్టరికాల్ని పెంచుకుంటూ, చక్కని స్నేహాలను పంచుకుంటూ రెండు తరాల సంపదను కాపాడుకుంటూ బంధాలను, బాధ్యతలను మరువని మన తరాన్ని...
పండు వెన్నెలా తెలియదు, పలకరించే బాంధవ్యాలు పెద్దగా తెలియని మన పిల్లలు, మన వరకే పరిమితమైన కుటుంబాలు, మన ఆలోచనా విధానంలో మార్పులతో మొదలైన మానసిక దౌర్భాగ్యాలు తొలగించలేని దుర్భేద్యాలుగా మారి అనుబంధాలను తెంచేస్తుంటే ఏమి చేయలేక చూస్తూ మిగిలిపోతూ, బాల్యాన్ని బరువైన చదువుల బరువుతో నింపేస్తూ, నలుగురిలో మనమూ గొప్పగా కనబడాలనే తపనతో నైతిక విలువలను నేల కూల్చుతూ ఆధునిక తరాన్ని డబ్బు, విలాసాలకు బానిసలుగా చేస్తున్న మనకు తెలిసినా తెలియనట్లు నటిస్తున్న అటు ఇటూ కానీ తరంగా మిగిలిపోతున్నందుకు ఖేదపడుతూ బోలెడు అభివృద్ధిని నాదించేశామని పొంగిపోతున్న నేటి సమాజ సామాజిక జీవులం మనం...!!
ఇప్పటికి ఈ ముచ్చట్లకు సశేషం....
ఇప్పటికి ఈ ముచ్చట్లకు సశేషం....
ఈ నెల నవ మల్లెతీగలో నా వ్యాసం....
వర్గము
ముచ్చట్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి