నేస్తం,
నమ్మిన దేవుడు ఎవరికైనా ఒకటే. విలువలు, మానవత్వం లేనిది మనిషిగా పుట్టిన మనకు. దేవుడికి విలువ లేకపోవడం ఏంటో నాకర్ధం కావడం లేదు. తప్పు ఎవరు చేసినా క్షమార్హులు కాదు అది ఏ మతము వారైనా, ఏ కులము వారైనా. ఏ మతమూ తప్పు చేయమని చెప్పదు. తప్పొప్పులు చేసేది మనిషి మాత్రమే. తప్పును ఖండించండి, సాటి మనిషిగా మానవత్వం చూపండి. అంతే కాని మతాలకు, దేవుళ్ళకు విలువలు లేవని అనకండి. మీరందరూ విజ్ఞులు, చాలా పెద్ద మనసు కల దొడ్డ మనుజులు. మీ ముందు మేము అల్పులమే....!!
13, ఏప్రిల్ 2018, శుక్రవారం
దేవుళ్ళకు విలువలు లేవట... !!
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
ఎందుకు మిమ్మల్ని మీరు కించపరచుకోవటం? ఇలా క్రొత్తక్రొత్త సుద్దులు చెప్పేవారిలో అనేకులు 'ఎదుటి వాడికి చెప్పేటందుకె నీతులు ఉన్నాయి' అన్నట్లుగా ఉండే వాళ్ళే. ఎవరో ఎందుకో పళ్ళికిలించి ఏదో ఇలాంటి సుద్దులు విసిరితే మరీ అంత వినయంగా ముడుచుకొనిపో నవసరం లేదు. అహాఁ అలాగా? అని ఊరకుంటే చాలు. ఆ చెప్పేవాళ్ళకి లేని కొమ్ములు తగిలించ నవసరం లేదు.
ప్రతి దానికి కులం మతం అంటగడుతూ అదేమని అడిగితే దేశద్రోహులంటున్నారండి. వాళ్ళు చాలా విజ్ఞత గలిగిన వాళ్ళని వాళ్ళ నమ్మకం. అందుకే వాళ్ళకే వదిలేసాను. సమస్యని సమస్యగా చూడనంత వరకు ఇవి తప్పవు. ధన్యవాదాలు మీ స్పందనకు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి