నా వరకు అమ్మ నేను పుట్టినప్పటి నుంచి నలుగురిలో నన్నో ప్రత్యేక గుర్తింపుతోనే పెంచింది. నాకు చదవడం రానప్పటి వయసు నుంచే ఇంటెడు చాకిరి చేసిన అమ్మ పక్కన పడుకుని అమ్మా ఈ కథ చదవవూ అంటే ఎంత చక్కగా కథ చదివి వినిపించేదో. అలా అమ్మ చదివే కథలు వింటూ నేను చదవడం త్వరగానే నేర్చేసుకున్నా. నా ఏడేళ్ళ వయసు నుంచే ఆంధ్రజ్యోతిలో సీరియల్ చదవడం అలవాటై పోయింది. ఈ అక్షరాలు ఇలా రాయగలుగుతున్నానంటే అది అమ్మ పెట్టిన అక్షర భిక్షే. అందుకే తొలి గురువు నాకు అమ్మే. నా ధైర్యం, నా బలం, బలహీనత, నా సంతోషం, నా బాధ, నా కోపం ఇలా నా అన్న ప్రతిదీ నాకు అమ్మే. ఇన్ని మాటలెందుకు నా జీవితమే అమ్మ. అమ్మ లేని జీవితం నాకు లేదు. ఈ ఐదు పదులకు దగ్గరౌతున్న జీవితయానంలో ఇప్పటికి అమ్మ చేతి ముద్దనే తినడం నా అదృష్టమనే చెప్పాలి. మా అమ్మ నా పిల్లలకూ అమ్మే. నాకిద్దరమ్మలున్నట్లే నా పిల్లలకూ ఇద్దరమ్మలు. నేను అమ్మా, అమ్మమ్మల దగ్గరే పెరిగాను. ఇప్పటికి అమ్మమ్మ కూడా నాతోనే ఉంటుంది. నా కోసం తన సంతోషాలను వదులుకుని నా కోసమే నాకన్నీ తానైంది మా అమ్మ. అమ్మ నాకు లేకపోతే పెళ్లైన తరువాత ఈ ఇరవై ఏళ్ళ జీవితం ఎప్పుడో ముగిసిపోయేదేమో. మనుష్యులు మనసులతో ఆడిన జీవిత వైకుంఠపాళీలో పాములు మిగేయాలని చూస్తుంటే అనుక్షణం కావలి కాస్తూతానే ఓ నిచ్చెనగా మారి నా గెలుపుకు కారణమైన అమ్మకు నేనేమిచ్చినా ఋణం తీరదు.
23, ఏప్రిల్ 2018, సోమవారం
మా అమ్మ...!!
అమ్మ గురించి అందులోనూ మా అమ్మ గురించి చెప్పడానికి ఈ అక్షరాలు, పదాలు సరిపోవంటే అతిశయోక్తి కాదు. జన్మనిచ్చినా, లాలిపాటలతో జోల పాడినా, కథలు చదివి చెప్పినా, దండించినా, దగ్గరకు తీసుకున్నా అమ్మకు సాటి మరెవరూ రాలేరు. మా అమ్మే కాదు ఏ అమ్మ అయినా అంతే. ప్రపంచం అంతా నిన్ను ఒంటరిని చేసినా నీతోనే ఉండేది అమ్మ. నా మొదటి స్నేహితురాలు అమ్మ. నా జీవితంలోకి తొంగి చూస్తే అమ్మ నాతో లేని క్షణాలు లేవనే చెప్పొచ్చు. అమ్మకు కొన్నాళ్ళు దూరంగా ఉన్నా అమ్మను దూరం చేసుకున్న సమయమే లేదు.
నా వరకు అమ్మ నేను పుట్టినప్పటి నుంచి నలుగురిలో నన్నో ప్రత్యేక గుర్తింపుతోనే పెంచింది. నాకు చదవడం రానప్పటి వయసు నుంచే ఇంటెడు చాకిరి చేసిన అమ్మ పక్కన పడుకుని అమ్మా ఈ కథ చదవవూ అంటే ఎంత చక్కగా కథ చదివి వినిపించేదో. అలా అమ్మ చదివే కథలు వింటూ నేను చదవడం త్వరగానే నేర్చేసుకున్నా. నా ఏడేళ్ళ వయసు నుంచే ఆంధ్రజ్యోతిలో సీరియల్ చదవడం అలవాటై పోయింది. ఈ అక్షరాలు ఇలా రాయగలుగుతున్నానంటే అది అమ్మ పెట్టిన అక్షర భిక్షే. అందుకే తొలి గురువు నాకు అమ్మే. నా ధైర్యం, నా బలం, బలహీనత, నా సంతోషం, నా బాధ, నా కోపం ఇలా నా అన్న ప్రతిదీ నాకు అమ్మే. ఇన్ని మాటలెందుకు నా జీవితమే అమ్మ. అమ్మ లేని జీవితం నాకు లేదు. ఈ ఐదు పదులకు దగ్గరౌతున్న జీవితయానంలో ఇప్పటికి అమ్మ చేతి ముద్దనే తినడం నా అదృష్టమనే చెప్పాలి. మా అమ్మ నా పిల్లలకూ అమ్మే. నాకిద్దరమ్మలున్నట్లే నా పిల్లలకూ ఇద్దరమ్మలు. నేను అమ్మా, అమ్మమ్మల దగ్గరే పెరిగాను. ఇప్పటికి అమ్మమ్మ కూడా నాతోనే ఉంటుంది. నా కోసం తన సంతోషాలను వదులుకుని నా కోసమే నాకన్నీ తానైంది మా అమ్మ. అమ్మ నాకు లేకపోతే పెళ్లైన తరువాత ఈ ఇరవై ఏళ్ళ జీవితం ఎప్పుడో ముగిసిపోయేదేమో. మనుష్యులు మనసులతో ఆడిన జీవిత వైకుంఠపాళీలో పాములు మిగేయాలని చూస్తుంటే అనుక్షణం కావలి కాస్తూతానే ఓ నిచ్చెనగా మారి నా గెలుపుకు కారణమైన అమ్మకు నేనేమిచ్చినా ఋణం తీరదు.
నా వరకు అమ్మ నేను పుట్టినప్పటి నుంచి నలుగురిలో నన్నో ప్రత్యేక గుర్తింపుతోనే పెంచింది. నాకు చదవడం రానప్పటి వయసు నుంచే ఇంటెడు చాకిరి చేసిన అమ్మ పక్కన పడుకుని అమ్మా ఈ కథ చదవవూ అంటే ఎంత చక్కగా కథ చదివి వినిపించేదో. అలా అమ్మ చదివే కథలు వింటూ నేను చదవడం త్వరగానే నేర్చేసుకున్నా. నా ఏడేళ్ళ వయసు నుంచే ఆంధ్రజ్యోతిలో సీరియల్ చదవడం అలవాటై పోయింది. ఈ అక్షరాలు ఇలా రాయగలుగుతున్నానంటే అది అమ్మ పెట్టిన అక్షర భిక్షే. అందుకే తొలి గురువు నాకు అమ్మే. నా ధైర్యం, నా బలం, బలహీనత, నా సంతోషం, నా బాధ, నా కోపం ఇలా నా అన్న ప్రతిదీ నాకు అమ్మే. ఇన్ని మాటలెందుకు నా జీవితమే అమ్మ. అమ్మ లేని జీవితం నాకు లేదు. ఈ ఐదు పదులకు దగ్గరౌతున్న జీవితయానంలో ఇప్పటికి అమ్మ చేతి ముద్దనే తినడం నా అదృష్టమనే చెప్పాలి. మా అమ్మ నా పిల్లలకూ అమ్మే. నాకిద్దరమ్మలున్నట్లే నా పిల్లలకూ ఇద్దరమ్మలు. నేను అమ్మా, అమ్మమ్మల దగ్గరే పెరిగాను. ఇప్పటికి అమ్మమ్మ కూడా నాతోనే ఉంటుంది. నా కోసం తన సంతోషాలను వదులుకుని నా కోసమే నాకన్నీ తానైంది మా అమ్మ. అమ్మ నాకు లేకపోతే పెళ్లైన తరువాత ఈ ఇరవై ఏళ్ళ జీవితం ఎప్పుడో ముగిసిపోయేదేమో. మనుష్యులు మనసులతో ఆడిన జీవిత వైకుంఠపాళీలో పాములు మిగేయాలని చూస్తుంటే అనుక్షణం కావలి కాస్తూతానే ఓ నిచ్చెనగా మారి నా గెలుపుకు కారణమైన అమ్మకు నేనేమిచ్చినా ఋణం తీరదు.
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి