26, జూన్ 2018, మంగళవారం

ఒకింత గర్వంగానే ఉంది..!!

నేస్తం,
          దగ్గర దగ్గర రెండు దశాబ్దాల క్రిందటి పరిచయ స్నేహం ఇప్పటికీ పరిమళిస్తూ నా వద్దకు వచ్చి కాసేపు సంతోషాన్ని పంచిందంటే..కలిసున్నది కొద్దీ రోజులే అయినా ఆత్మీయంగా అక్కా అంటూ నన్ను పలకరించే కవిత తన కుటుంబంతో సహా వచ్చి కాసేపు పలకరించి వెళ్లిన  ఆ ఆనందం ఎప్పటికి తరగని నా ఆస్థిగా మిగిలిపోతుందని చెప్పడం నాకు ఒకింత గర్వంగానే ఉంది. చాలా చాలా కృతజ్ఞతలు కవితా.
       డబ్బులకు, హోదాలకు, ఉద్యోగాలకు విలువలు ఇచ్చే ఈరోజుల్లో నాకున్న కొంతమంది హితులు, స్నేహితులు, చాలా తక్కువమంది బంధువులు ఉన్నారని చెప్పడం ఓ కంట కన్నీరు, ఓ కంట పన్నీరు లాంటిదే. కొందరు స్నేహంలో కూడా వారి వారి స్వప్రయోజనాల కోసం మనతో నటిస్తారు. ఆ ముసుగు తొలిగితే కానీ మనకు వారి అసలు నైజం బయటపడదు. బంధువుల సంగతి చెప్పనే అక్కరలేదు, పలకరిస్తే పాపం అన్నట్టుగా ఉంది ఈరోజుల్లో.  ఏదేమైనా బంధాలను మీ అవసరాలకు వాడుకోకండి, రేపటిరోజున మీ మనస్సాక్షికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మీకు మనసే లేదంటారా సరే మీరు మనుష్యులని ఒప్పేసుకుంటాం. 

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Sakshyam Education చెప్పారు...

మీ బ్లాగు చాలా బాగుంది, మంచి రచనలు అందించారు.
ఒకసారి మా బ్లాగ్ కూడా దర్శించి మీ అమూల్యమైన అభిప్రాయం తెలియజేయండి

చెప్పాలంటే...... చెప్పారు...

dhanyavadalandi

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner