1. ఆశ్రిత పక్షపాతే అక్షరమెప్పుడూ_ఓదార్పు తన ఇంటిపేరంటూ...!!
2. అక్షరానుబంధం ఆసరా ఇస్తూనే ఉంటుందెప్పుడూ_మనసును పంచుకోవడానికి...!!
3. టెక్నాలజీ పనితనమిది_చావు పుట్టుకల మాయాదర్పణాన్ని క్షణాల్లో చూపుతూ...!!
4. అనుబంధం అపహాస్యమైంది_నటనల విశ్వరూపాలను చూస్తూ...!!
5. మనసు లోగిలి నిండా నీ ఆనవాళ్ళే_వీడని బంధపు జ్ఞాపకాలై మెసలుతూ..!!
6. కలతై కరుగుతున్న గతం_వెంటాడే వర్తమానాన్ని గుర్తుచేస్తూ...!!
7. పదాల పరుగు పాతదే_నీ ఊహలతో చేరినందుకే ఇలా కొత్తగా...!!
8. నిన్ను వెంబడిస్తూనే ఉంది మనసు_గతజన్మ మౌనాలను వెంటేసుకుని...!!
9. మనసుదెప్పుడూ గెలుపే_నమ్మకానికి అపనమ్మకానికి మధ్యన నలుగుతున్నా..!!
10. కన్నీరింకని కనులకు చెప్తున్నా_మది లాలింపులో మార్దవంకమ్మని...!!
11. వెన్నెలకే వర్ణాలన్నీ_మచ్చలేని మనసుకు చీకటి రంగు పులిమేస్తూ....!!
12. ఒక పుస్తకాన్ని తెరిచి చూసా_మనసాక్షరాలే ప్రతి కాగితంలోనూ....!!
13. భావ పరిమళాలనెన్ని పంచాయెా_అనుభూతులను ఆవిష్కరిస్తూ...!!
14. వీడ్కోలెరుగని కలయికే మనది_వేవేల వర్ణాలకు రూపాన్నిస్తూ...!!
15. బంధానికి భాష్యమక్కరలేదు_అక్కున చేర్చుకునే మనసే దాని ఊపిరి...!!
16. బదులెలా చెప్పను_ఆనవాళ్ళే ప్రశార్థకమౌతుంటే..!!
17. చెదరని అభిమానమది_నకిలీల నకళ్ళు బయటబెడుతూ...!!
18. అంతరాయాలను అధిగమించడమే_పదాల ఆసరాతో నిలదొక్కుకుంటూ...!!
19. చూపులు చురుకే_నీ జాడ తెలియక చిరునవ్వులే వెలవెలబోతూ...!!
20. తప్పుకోనంటున్నాయి ఆత్మీయతలు_తడిగుండెకు తోడుగా నిలుస్తూ...!!
21. సాక్ష్యాలు చెల్లని నోట్లైనాయి_నటిస్తున్న బంధాల నటనల ముందు...!!
22. కలల సాగరమే జీవితం_అలల ఆటుపోట్లకు తలొగ్గుతూ...!!
23. మనసంతా ఖాళీనే_పూరించే పూరణలు కరువై..!!
24. కొన్ని జ్ఞాపకాలంతే_మెురాయిస్తూనే ఉంటాయి వదలిపోలేమంటూ....!!
25. కొన్ని మనసులంతే_గాయాల బారినుండి బయట పడలేక నలుగుతూ...!!
26. కూడికలు తీసివేతలు_తప్పనిదే ఈ జీవితం....!!
27. నువ్వు చేసిన గాయమెుక్కటి చాలు_జన్మజన్మలకు వెంటాడుతూ..!!
28. మరో నామజపమెలా చేస్తాయి మరి_అక్షరాలను అల్లుకుంది నువ్వయితే..!!
29. వింతలెప్పుడూ విచిత్రాలే_కాలం కదలికలను సచిత్రాలుగా మలచలేక...!!
30. కాలమెప్పుడూ ప్రశ్నార్థకమే_శబ్దానికి నిశ్శబ్ధానికి మధ్యన...!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి